తెలుగు చిత్రసీమలో ఉమ్మడి కుటుంబానికి ప్రతీక రాజమౌళి కుటుంబం. కీరవాణి, రాజమౌళి.. వీళ్లందరి కుటుంబాలు కలిస్తే దాదాపు 30 -40మంది పోగైపోతారు. ప్రతీ పండగనీ ఓ సెలబ్రేషన్‌లా చేసుకుంటారు. షూటింగులతో బిజీగా ఉన్నా సరే, కుటుంబానికంటూ సమయం కేటాయించడం మర్చిపోరు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ అంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో మునిగితేలుతోంది. హైదరాబాద్ శివార్లలో రాజమౌళికి వందెకరాల ఫామ్ హౌస్ ఉంది. ఇప్పుడు రాజమౌళి కుటుంబం మొత్తం అక్కడే ఉంది. ఈరోజూ, రేపూ అక్కడే విందూ వినోదాలు. 3వ తేదీన మళ్లీ నగరంలోకి వస్తారు. కీరవాణి తనయులిద్దరూ నటించిన `మత్తువదలరా` సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ సెలబ్రేషన్స్ కూడా ఇక్కడే చేసుకుంటున్నారు. రాజమౌళి ఇంట్లో వేడుకలు అంటే సాదా సీదాగా ఉండవు. అక్కడ కూడా రాజమౌళి మార్క్ కనిపిస్తుంటుంది. ఈసారి ఎలా ప్లాన్ చేశారో, ఫొటోలు బయటకు వస్తే గానీ తెలీవు.