దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎన్నికల ప్రచారం చేస్తారా ? అవును.. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు రాజమౌళితో చైతన్యపర్చాలని నిర్ణయించారు, అయితే ఇది తెలుగు రాష్ట్రలలో కాదు కర్ణాటకలో. రాజమౌళిని కర్ణాటకలోని రాయచూరు జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా నియమించినట్లు ఆ జిల్లా పాలనాధికారి చంద్రశేఖర్ నాయక్ చెప్పారు.
రానున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు రాజమౌళితో చైతన్యపర్చాలని, ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు రాజమౌళి పేరు సిఫార్సు చేశామన్నారు. ఈ ప్రతిపాదనను రాజమౌళి ఆమోదించారని వివరించారు. రాయచూరు జిల్లా మాన్వి తాలూకా అమరేశ్వర క్యాంపులో జన్మించిన రాజమౌళి ప్రచారంతో జిల్లాలో పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజమౌళికి రాజకీయాలపై ఆసక్తి వుంది. గతంలో లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ తో కలసి పని చేశారు. అయితే ఇతర రాష్ట్రంలో ప్రచారం చేయడం ఇదే మొదటి సారి.