తొలి సినిమా మత్తువదలరాతో ఆకట్టుకున్నాడు శ్రీ సింహ. తెల్లవారితే గురువారం మాత్రం నిరాశ పరిచింది. ఇప్పుడు ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే థ్రిల్లర్ తో వస్తున్నాడు. ఒకే లొకేషన్ లో షూట్ చేసిన ప్రయోగాత్మక చిత్రమిది. సురేష్ బాబు, సునీత తాటి నిర్మించారు. సెప్టెంబర్ 23న థియేటర్లోకి వస్తుంది. అయితే ఇప్పటికే ఈ సినిమాని తన ఫ్యామిలీకి చూపించాడు సింహ. రాజమౌళి ఈ సినిమా చూసి హ్యాపీగా ఫీలయ్యారట. అలాగే కొన్ని సూచనలు, మార్పులు చెప్పారట. ఈ విషయాన్ని సింహ స్వయంగా చెప్పాడు.
” ఈ సినిమా గురించి మొదట ఇంట్లో ఏమీ చెప్పలేదు. సినిమా పూర్తయ్యాక ఫ్యామిలీ కోసం ఒక స్పెషల్ షో వేశాం. సినిమా చూసి రాజమౌళి గారు చాలా ఆనందం వ్యక్తం చేశారు. చిన్న చిన్న మార్పులు కూడా సూచించారు. ఆ మార్పులు చేసిన తర్వాత సినిమా ఇంకా స్ట్రాంగ్ అయ్యింది. ఇది సర్వైవల్ థ్రిల్లర్ హాలీవుడ్ లో విరివిగా వస్తుంటాయి. ఈ జోనర్ ని ఇక్కడ ఎవరు ఒకరు మొదలుపెట్టాలి. మేము స్టార్ట్ చేయడం చాలా ఎక్సయిటింగా వుంది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం వుంది” అని చెప్పుకొచ్చాడు సింహ.