రాజమౌళి కలల చిత్రం `మహా భారతం`. ఈ సినిమాని 5 భాగాలుగా తీయాలన్నది రాజమౌళి ఆలోచన. ఈసినిమాతో తన కెరీర్‌కి పుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాడు. అమీర్ ఖాన్ కి ఎప్పుడో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పి.. ఓకే అనిపించుకొన్నాడు రాజమౌళి. అయితే ఈ సినిమా ఇప్పట్లో మొదలవ్వదు. కనీసం ఐదేళ్లు పడుతుంది. ఈలోగా.. ఈ సినిమాకి సంబంధించిన పనులు మొదలైపోయాయని టాక్. రచయిత విజయేంద్రప్రసాద్ `మహా భారతం` స్క్రిప్టు పనులు మొదలెట్టేశార్ట. రాజమౌళి సినిమాలన్నింటికీ.. విజయేంద్ర ప్రసాదే కథ అందిస్తుంటారు. ప్రస్తుతం మహేష్ బాబు సినిమాకి సంబంధించిన కథ రాయాల్సివుంది. అయితే… ఆ స్క్రిప్టులో కూర్చోవడానికి రాజమౌళి కొంత సమయం అడిగార్ట. ఈలోగా `మహాభారతం` వర్క్‌ని విజయేంద్ర ప్రసాద్ మొదలెట్టారు. మహాభారతంలోని కీలకమైన ఘట్టాలన్నింటికీ గుదిగుచ్చి 5 భాగాలుగా చేయబోతున్నాడు. భారతంలో 18 పర్వాలున్నాయి. ఒక్కో భాగంలో 3 నుంచి 4 పర్వాలు కవర్ చేసుకుంటూ వెళ్లాలి. ప్రతీ భాగంలోనూ ముగింపు పర్ఫెక్ట్ గా కుదరాలి. ఇదంతా చాలా పెద్ద పని. ప్రతీ భాగాన్నీ యుద్ధంతోనే ముగించాలని నియమంగా పెట్టుకొన్నార్ట. అలా ఈ కథని సెట్ చేయాలంటే చాలా కసరత్తు చేయాలి. అందుకే.. ఈ పనులు ముందే మొదలెట్టేశారు.