మరికొద్ది సేపట్లో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం ప్రారంభం కానుంది. ఇప్పటివరకు, ఈ చిత్రం గురించి ఎటువంటి సమాచారం అధికారికంగా ప్రకటించ బడలేదు. సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై గాని, ఇతర నటుల గురించి గానీ, టెక్నీషియన్స్ గురించి గానీ ఎటువంటి సమాచారం లేదు. అయితే సోషల్ మీడియా లో మాత్రం ఈ సినిమా టైటిల్ గురించి పుకార్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
సోషల్ మీడియా తో పాటు ప్రధాన మీడియాలో కూడా ప్రచారమైన ప్రధానమైన పుకారు ఏమిటంటే, ఈ సినిమా టైటిల్ రామ రావణ రాజ్యం అని. ఈ సినిమా వర్కింగ్ టైటిల్ RRR అంటే అర్థం ఇదే నని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో కూడా ఈ సినిమా గురించి రకరకాల పుకార్లు వచ్చాయి. అందులో ఒకటి ఈ సినిమాలో ఉండే ప్రధాన తారాగణం అంతా ఆర్ అనే అక్షరంతో పేరు గల వారే నని. అందుకే రాజశేఖర్ ని ఈ సినిమాలో విలన్ గా తీసుకుంటున్నారు అని. అయితే ఆ తర్వాత అది వట్టి పుకారేనని తేలిపోయింది. అలాగే మరొక పుకారు ఈ సినిమా క్రీడా నేపథ్యంలో సాగుతుంది అని. ఇంకొక రూమార్ ఏమిటంటే, ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు అన్నదమ్ములుగా నటిస్తున్నారు అని. మరొకరు రూమరేమో ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు అని. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమా మీద వచ్చిన పుకార్ల తోనే చాంతాడంత లిస్టు తయారవుతుంది.
మరి ఆ పుకార్ల కోవలోనే ఈ సినిమా టైటిల్ రామ రావణ రాజ్యం అన్నది కూడా వట్టి కారు గా ఉందా లేదా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా ఈ పుకార్లలో కొన్నింటికైనా ఇవాళ ఫుల్స్టాప్ పడుతుందేమో చూడాలి.