రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ ల ట్రిపులార్ కలెక్షన్స్ స్టడీగా వున్నాయి. సోమ, మంగళ వారంలో కూడా నగరంలోని చాలా థియేటర్స్ లో హౌస్ ఫుల్ హంగామా కనిపించింది. అయితే బాహుబలికి వున్నట్లు రిపీట్ ఆడియన్స్ తో పోల్చుకుంటే ట్రిపులార్ కి తక్కువే. రాజమౌళి సినిమా అంటే బ్రాండ్ తో పాటు ఎన్టీఆర్ , చరణ్ అభిమానులు సినిమాని చూస్తున్నారు. అయితే రిపీట్ ఆడియన్స్ కోసం త్రీడీ ఫార్మేట్ పై ద్రుష్టి పెట్టింది చిత్ర బృందం.
ట్రిపులార్ ని త్రీడి లో ఫార్మాట్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే త్రీడీ స్క్రీనింగ్ చాలా తక్కువ. హైదరాబద్ మొత్తంలో ఒక్క థియేటర్ మాత్రమే బుక్ మై షో లాంటి యాప్స్ లో కనిపిస్తుంది. ఈ వీకెండ్ నుంచి త్రీడీ స్క్రీన్స్ పెంచాలని నిర్ణయానికి వచ్చారు నిర్మతాలు. దేశవ్యాప్తంగా స్క్రీన్లు పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే కాకుండా ఆ శుక్రవారం నుంచి పెంచిన టికెట్ల రేట్లు తగ్గించాలని డిస్టిబ్యూటర్స్ కి సమాచారం ఇచ్చారు. త్రీడి స్క్రీన్ లు పెంచడం, టికెట్ల ధర తగ్గించడం వలన రెండో వారం కూడా కూడా కలెక్షన్స్ స్టడీగా ఉంచాలనే ఆలోచనలో వున్నారు నిర్మాతలు. అంతేకాదు శనివారం వీకెండ్ తో పాటు ఉగాది కూడా వుంది. ఈ పండగ కూడా ట్రిపులార్ కి కలిసొచ్చే అవకాశాలు పుష్కలంగా వున్నాయి.