ఎన్టీఆర్ – రాజమౌళిలకున్న సంబంధం ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు. స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ.. ఈ సినిమాలే చెబుతాయి వాళ్లేంటో! ఎన్టీఆర్ సినిమా ఎప్పుడొచ్చినా రాజమౌళి ఫస్ట్ డే.. ఫస్ట్ షో చూసేయాల్సిందే. జనతా గ్యారేజ్ కోసం కూడా రాజమౌళి ఆసక్తిగా ఎదురుచూశాడు. ఇప్పుడు ఈ సినిమాని ఇప్పటికే రెండు సార్లు చూసేశాడు. మోహన్‌లాల్ – ఎన్టీఆర్‌ల కాంబినేషన్, వాళ్లమధ్య వచ్చే సన్నివేశాలు బాగా నచ్చాయని, స్క్రీన్‌పై వాళ్లిద్దరినీ ఒకేసారి చూసి.. చాలా ఎంజాయ్ చేశానని ఫేస్బుక్లో సందేశం పంపాడు రాజమౌళి. టెంపర్ నుంచి ఎన్టీఆర్ కెరీర్‌ని మలచుకొంటున్న విధానం చూస్తుంటే చాలా గర్వంగా ఉందని, రాజీవ్ కనకాల పెర్ఫార్మెన్స్ కూడా నచ్చిందని, వరుసగా రెండు సార్లు ఈ సినిమాని చూసి ఆస్వాదించానని చెప్పుకొచ్చాడు రాజమౌళి. జక్కన్న నుంచి కాంప్లిమెంట్లు రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకొంటున్నారు. సినిమా బ్లాక్‌బ్లస్టర్ హిట్ అయినంత సంబర పడుతున్నారు. జనతాకు ఇలాంటి సపోర్టే కావాలిప్పుడు. టాక్ ఉలా ఉన్నా… తొలి నాలుగు రోజులూ ఈ సినిమా దుమ్ము దులిపేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ఓ అంచనాకు వచ్చేశాయి. తొలి రోజు ఎంతొచ్చిందన్నది ఇంకాసేపట్లో తెలిసిపోతుంది.