బాహుబలి కోసం రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన అనుమతి లేకుండా ఈ సినిమాకి సంబధించిన ఒక్క లొకేషన్ స్టిల్ కూడా బయటికిరాలేదు. అలాగే పుటేజ్ ను కూడా ఎడిట్ రూమ్ లో పెట్టలేదు. దానికి కోసం అమెరికా నుండి ఒక అధునూతన డాటా స్టోరేజ్ పరికరాన్ని దిగుమతి చేసుకొని ఫింగర్ ప్రింట్ స్కేనర్ లో లాక్ చేశారు. రాజమౌళి తప్పితే ఇంకా ఎవరూ దాని ఓపెన్ చేయడానికి వీలులేకుండా చూశారు. ఇదే కాదు, లొకేషన్ లోకి సెల్ ఫోన్ అనుమతి నిరాకరణ, డిపార్ట్మెంట్ వైజ్ గా ఐడీ కార్డులు, ఇలా ఒక్కటేమిటి చాలానే ముందు జాగ్రత్త చర్యలు అమలు చేశారు. ఇక స్క్రిప్ట్ విషయానికి వస్తే.. ఈ సినిమా పూర్తి కధ .. ప్రభాస్, రానా, అనుష్క లాంటి కీలక పాత్రధారులకు, యూనిట్ లో పనిచేసే రాజమౌళి కుటుంబ సభ్యులకు తప్పితే చాలా మందికి ఈ సినిమా పూర్తి కధ వివరంగా చప్పడానికి ఇష్టపడలేదట రాజమౌళి. మొన్న తమన్నానే ఈ విషయం చెప్పింది. ”నాకు అవంతికి రోల్ గురించే తెలుసు. నా వరకూ వున్న సీన్లు చెప్పారు. చెప్పినట్లు చేసేశాను. అంతకుమించి ఈ సినిమా కధ గురించి నాకు తెలీదు”అని చెప్పుకొచ్చింది. తమన్నానే కాదు. ..ఈ సినిమాలో చాలా మంది నటీనటులు కేవలం సీన్ వరకే పరిమితమయ్యారు.
ఈ సినిమాలో విషయంలో రాజమౌళి ఎంత గోప్యంగా వున్నారో చెప్పడానికి మరో నిదర్శనం తాజాగా విడుదలైన ఆడియో ట్రాక్ లిస్టు. బాహుబలి పార్ట్2 లో మొత్తం ఐదు పాటలు వున్నాయి. ఈ పాటలన్నీ రాజమౌళి కుటుంబ సభ్యులే రాసేశారు. నాలుగు పాటలు సంగీత దర్శకుడు కీరవాణి రాస్తే, కీరవాణి తండ్రి శివదత్త మరో పాట రాశారు. కీరవాణి గేయ రచన గురించి మళ్ళీ చెప్పక్కర్లేదు. ఆయన సంగీత దర్శకుడిగా మారినప్పటినుండి అడపాదడపా రాస్తూనే వున్నారు. ఆయన భావుకత బావుటుంది. వేదంలో ‘రూపాయి’ పాట ఎంతో అలోచింపజేసింది. ఇప్పుడు బాహుబలి పార్ట్ 2కోసం ఆయనతో ఏకంగా నాలుగు పాటలు రాయించేశారు రాజమౌళి. దీనికి కారణం బాహుబలి కధను మరొకరితో పంచుకోవడం ఇష్టంలేకనే ఇలా ఫ్యామిలీ కార్డ్ వాడారట రాజమౌళి. గేయ రచన అంటే కచ్చితంగా సినిమా కధ చెప్పాలి. పూర్తి కధ కాకపోయినా ఆ సన్నీవేశం వరకైనా వివరించాలి. బాహుబలి విషయంలో జక్కన్నకు ఇది కంఫర్ట్ బుల్ గా అనిపించలేదట. అందుకే తను ఎంతగానో అభిమానించే పెద్దన్న కీరవాణితోనే బాహుబలి గేయ రచన చేయించేశారు రాజమౌళి.