”ఆర్ఆర్ఆర్’ మొదలుపెట్టినప్పుడు రాజమౌళికి త్రీడీ ఆలోచన లేదు. నిజానికి త్రీడీ ఫార్మెట్ రాజమౌళికి మొదటి నుంచి ఇష్టం లేదు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ విషయానికి వచ్చేసరికి కరోనా లాక్ డౌన్ పడింది. గ్యాప్ దొరికింది. ఈ గ్యాప్ లో రాజమౌళిని ఓ త్రీడీ కంపెనీ సంప్రదించింది. ‘కొన్ని ఫ్రేములు ఇవ్వండి. త్రీడీ చేసి చూపిస్తాం. నచ్చకపొతే వదిలేయండి” అని కోరింది. అయిష్టంగానే కొంత పుటేజ్ ఇచ్చారు రాజమౌళి. వాళ్ళు ఇచ్చిన అవుట్ ఫుట్ రాజమౌళికి బాగా నచ్చింది. దీంతో ఆ టెక్నిషియన్లుతో ట్రావెల్ అయ్యరు రాజమౌళి. కరోనా లాక్ డౌన్ లో త్రీడీపై వర్క్ చేశారు. మిగతా షూట్ కూడా త్రీడీకి అనుగుణంగా చేశారు.
ఇప్పుడు దానికి ప్రతిఫలం అందుకుటుంది ఆర్ఆర్ఆర్. సినిమాకి రిపీట్ ఆడియన్స్ రావడానికి త్రీడీ ఫార్మాట్ బాగా కలిసొచ్చింది. మొదటి వారంలో సింగల్ గా సినిమా చూసిన ప్రేక్షకులు .. ఫ్యామిలీని తీసుకువెళ్ళడానికి త్రీడీ థియేటర్ నే చూస్తున్నారు. రీపీట్ చూడాలంటే ఏదో కొత్త అనుభవం కావాలి. త్రీడీలో ఎలా వుందో చూద్దామని ఫ్యామిలీని వెంటబెట్టుకొని థియేటర్ కి వెళుతున్నారు. హైదరాబాద్ లో చాలా చోట్ల త్రీడీ షోలు హౌస్ ఫుల్ గా నడుస్తున్నాయి. త్రీడీని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ ఎంట్రీ, ఇంటర్వెల్ లో జంతువుల సీన్, క్లైమాక్స్ ఫైట్ ..ఇలా చాలా సీన్లు త్రీడీలో అద్భుతంగా వచ్చాయి. రిపీట్ ఆడియన్స్ పెరగడానికి త్రీడీ ఫార్మెట్ చాలా ఉపయోగపడింది. భవిష్యత్ లో రాజమౌళి ‘మహాభారతం’ లాంటి సినిమా తీస్తే దాన్ని కూడా త్రీడీలో చేస్తే ప్రపంచస్థాయిలో ఆకట్టుకునే అవకాశం వుంటుంది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ త్రీడీ రిజల్ట్ సినిమా కలెక్షన్స్ ని పెంచడంతో పాటు త్రీడీపై రాజమౌళికి ప్రేమ పెంచిందనే కూడా చెప్పాలి.