బడా బడా సినిమా జనాలు ఎక్కువగా ఎక్కడుంటారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్. కానీ ఏస్ డైరక్టర్ రాజమౌళి మాత్రం మణికొండ ప్రారంభంలోని ఓ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో వుంటున్నారు. ఈగా సినిమా తరువాత నుంచి అక్కడే వుంటున్నారు. ఆయన, ఆయన సోదరుడు కీరవాణి, సన్నిహితుడు సాయి కొర్రపాటి, మరి కొందరు కజిన్స్ అందరూ ఆ కాంప్లెక్స్ లోనే వుంటారు.
కానీ ఇకపై రాజమౌళి అక్కడ దొరకరు. మరో పదేళ్ల పాటు ఆఫీసు వ్యవహారాలు అన్నీ అల్యూమినియం ఫ్యాక్టరీ నుంచే వుంటాయి ఎక్కువగా. ఇప్పుడు వున్న అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ పూర్తిగా రెసిడెన్షియల్. అక్కడ మరీ ఎక్కువగా జనాల రాకపోకలు వుంటే మిగిలిన వారికి ఇబ్బంది.
ఇది ఆలోచించి, పైగా ఏడాదిన్నర పాటు తీయబోయే ఆర్ ఆర్ ఆర్ ను దృష్టిలో పెట్టుకుని, అల్యూమినియం ఫ్యాక్టరీలో కొంత స్థలాన్ని పదేళ్ల పాటు లీజుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్థలంలో సెమీ పర్మనెంట్ బిల్డింగ్ నిర్మించుకుంటారు. ఇకపై ఆఫీసు వ్యవహారాలు అన్నీ ఇక్కడి నుంచే నడుస్తాయి. అవసరం అయితే నివాసం కూడా ఎక్కువగా ఇక్కడే వుంటారు.
అంటే ఆర్ ఆర్ ఆర్ తరువాత చేయబోయే సినిమాలు కూడా కేరాఫ్ అల్యూమినియం ఫ్యాక్టరీ అన్నమాట. ఆ స్థలం యాజమాన్యానికి కూడా ఉభయ కుశులోపరి అన్నట్లు వుంటుంది వ్యవహారం. రాజమౌళి అక్కడ వుంటే, ఆయన సినిమాల షూటింగ్ లు అన్నీ అక్కడే వుంటాయి. ఇక అక్కడంతా కళకళలాడుతూ వుంటుంది.