బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు ? ఈ ప్రశ్నకి సమాధానం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆ ప్రశ్న సినిమాపై పెంచిన అంచనాలు అన్నీ ఇన్నీ కావు. సినిమా చివర్లో ఒక మంచి మలుపులా ఉంటుందనుకొన్నాను తప్ప, ఆ ప్రశ్న ఇంతగా ఆసక్తిని రేకెత్తిస్తుందని రాజమౌళి కూడా ఉహించివుండరు. అయితే ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైయింది. ‘బాహుబలి: ది కన్క్లూజన్’ దాన్ని చూపించబోతున్నారు. కట్టప్పా బాహుబలిని ఎందుకు చంపాడు ?బాహుబలి విజువల్ వండర్స్ ఎలా వుండబోతున్నాయి ? బాహుబలి2 ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది ? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. ఈ నేపధ్యంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి 2ట్రైలర్ బయటికివచ్చేసింది. అద్భుతం అనిపించేసింది ఈ ట్రైలర్. రెండు నిమిషాల ఇరవై సెకన్లు నిడివిగల ఈ ట్రైలర్.. ఆద్యంతం అద్భుతంగా సాగింది.
బాహుబలి సృస్టించిన అద్భుత చరిత్ర అందరికీ తెలుసు. దీంతో బాహుబలి పార్ట్ 2పై అంచనాలు ఆకాశానికి తాకాయి. అలాంటి సినిమా ట్రైలర్ కట్ చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే రాజమౌళి తన ప్రతిభను మరోసారి చూపించాడు. అద్భుత రీతిలో ఈ ట్రైలర్ కట్ చేశారు. ఈ ట్రైలర్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. బాహుబలి.. అంతకుమించి పార్ట్ 2 అని చెప్పాలి. అంత గ్రాండియర్ గా వుంది పార్ట్ 2ట్రైలర్. ప్రతీ షాట్ పీక్స్ లో చూపించారు. వార్ సీన్స్, ఎమోషన్స్, రోమాన్స్, సస్పెన్స్.. ఇలా ఆద్యంతం గ్రిప్పింగ్ గా సాగింది.