వీఎఫ్ఎక్స్ మాయాజాలం మగధీరతో ఆరంభమైంది. ఆ సినిమాతో చరణ్ కెరీర్‌కి బాటలు వేశాడు రాజమౌళి. అయితే ఈ సినిమా జరుగుతున్నప్పుడు స్టోరీ డిస్కర్షన్స్‌లో చిరంజీవి ప్రమేయం ఎక్కువగా ఉండేదట. ఆయన కొన్ని సలహాలూ ఇచ్చారని రాజమౌళి చెప్పుకొచ్చారు. `సైరా` ప్రీ రీలీజ్ వేడుకలో ఆ అనుభవాల్ని వేదికపైనుంచి పంచుకున్నారు.
”మగధీర డిస్కర్షన్స్‌లో చిరంజీవి పాల్గొనేవారు. మాకు కొన్ని సలహాలూ ఇచ్చారు. కొన్ని సన్నివేశాల్లో నటించి మరీ చూపించేవారు. రామ్‌చరణ్ పాత్రలో తనని తాను ఊహించుకుంటున్నారని ఆ తరవాత నాకు అర్థమైంది. మగధీర విడుదలయ్యాక.. ‘ఇలాంటి సినిమా నేనెందుకు చేయలేదు’ అని నాతో చెప్పారు. ఆ కోరికను ఈ రోజు చరణ్ తీర్చాడు. చరణ్ తన తండ్రికి ఇస్తున్న కానుక మాత్రమే కాదు, తెలుగు చిత్రసీమకు అందిస్తున్న కానుక సైరా. ఇలాంటి సినిమా తీయడానికి ఎంత కష్టపడాలో నాకు తెలుసు. వీఎఫ్ఎక్స్ షాట్స్ తీయడం కష్టం కాదు, వాటి మధ్య ఎమోషన్ మిస్ అవ్వకుండా తీయడం చాలా కష్టం. సురేందర్‌రెడ్డికి ఆ క్రెడిట్ దక్కుతుంది” అన్నారు.