దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం బాహుబలి-2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. బాహుబలి తర్వాత జక్కన్న ఏ సినిమా చేస్తాడు అన్న విషయం మీద ఓ క్లారిటీ రాలేదు. అయితే బాహుబలి తర్వాత రాజమౌళి ‘గరుడ’ అంటూ కొద్దిరోజులు హడావిడి చేసిన మీడియా ఇప్పుడు మరో కొత్త పాట పాడుతుంది. రాజమౌళి తన తర్వాత సినిమా జూనియర్ తోనే తీస్తాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇప్పటికే బాహుబలి సెకండ్ పార్ట్ తో ఆ కథ ముగిసినా మరో కొత్త కథతో బాహుబలి కొనసాగుతూనే ఉంటుందని రాజమౌళి చెప్పాడు. సో బాహుబలి కంక్లూజన్ తర్వాత రాజమౌళి ఎన్టీఆర్ ను హీరోగా పెట్టి మరో చారిత్రక నేపథ్యంలో సినిమా తీస్తాడని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా ఉంటాడంటూ గుసగుసలాడుతున్నారు. ఎటువంటి పాత్రనైనా చాలెంజింగ్ గా చేసే ఎన్టీఆర్ తో విలక్షణ నటనకు పెట్టింది పేరుగా చేసే సూర్య కలవడం అంటే అదో భారీ మల్టీస్టారర్ అన్నట్టే. మరి వస్తున్న వార్తలన్ని అభిమానులు ఖుషి చేసుకునేందుకు బాగానే ఉన్నా అవి నెరవేరే నిజాలా లేక రూమర్ గా మిగిలే మాటలా అన్నది తెలియాల్సి ఉంది.