ఓ సినిమాని జనంలోకి తీసుకెళ్లాలంటే… రకరకాల జిమ్మిక్కులు చేయాల్సిందే. స్పెషల్ ఎపీరియన్స్లూ, వాయిస్ ఓవర్లూ.. ఈ బాపతు ఎట్రాక్షన్లే. చిన్న సినిమాకి స్టార్ హీరో దిగి వచ్చి వాయిస్ ఓవర్ చెబితే – ఓ రకమైన క్రేజ్ ఏర్పడుతుంది. సదరు హీరో వల్ల, ఆ సినిమాకి పబ్లిసిటీ పెరుగుతుంది. ఆ వాయిస్ ఓవర్ తో సినిమా ఫలితాలేం మారిపోవు. జస్ట్ కాస్త ఎక్కువ ప్రచారం లభిస్తుందంతే.
ఇప్పుడు రాజమౌళి కూడా ఇదే టెక్నిక్ ఫాలో అవుతున్నాడు. `ఆర్.ఆర్.ఆర్` సినిమాకి గానూ.. హిందీ వెర్షన్‌కి అమీర్ ఖాన్ తో వాయిస్ ఓవర్ చెప్పించబోతున్నాడని టాలీవుడ్ టాక్. అమీర్ కీ, రాజమౌళికీ మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఇద్దరూ కలసి ఓ సినిమా చేయాలనుకున్నారు. రాజమౌళి కలల సినిమా `మభా భారతం`లో అమీర్ ఎప్పుడో ఫిక్సయిపోయాడు. రాజమౌళి అడిగితే.. కాదనకుండా ఆయన వాయిస్ ఓవర్ ఇస్తాడు. ఇప్పుడు తెలుగులో చిరంజీవితోనూ, మలయాళంలో మోహన్ లాల్ లేదా మమ్ముట్టి తోనూ. వాయిస్ ఓవర్ చెప్పిస్తారని టాక్. రాజమౌళి సినిమా అంటేనే ఓ క్రేజ్. పైగా.. ఎన్టీఆర్, చరణ్‌లు కలిసి నటిస్తున్న `రియల్` మల్టీస్టారర్ ఇది. ఈ సినిమాకి ఇంత క్రేజ్ సరిపోతుంది. అయినా.. రాజమౌళి అదనపు హంగుల కోసం ఆరాటపడడం… నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. తన సినిమాని సేల్ చేసుకోడంలో రాజమౌళి తరవాతే ఎవరైనా. మార్కెటింగ్ వ్యూహాలకు పెట్టింది పేరు. సినిమాకి బజ్ ఎప్పుడు తీసుకురావాలో, ఎలా తీసుకురావాలో బాగా తెలుసు. అలాంటి రాజమౌళి కూడా.. వాయిస్ ఓవర్ లతో తన సినిమాకి క్రేజ్ పెంచుకోవాలని చూడడం ఏమిటో అర్థం కావడం లేదు.