సినిమాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఇట్టే సమస్యలను పరిష్కరిస్తారు. రియల్‌గా అలాంటి రజనీ కోసమే ఏపీ ప్రభుత్వం కొంత కాలం నుంచి వెదుకుతోంది. అదీ కూడా ఆర్థిక కష్టాలు తీల్చేందుకు. చివరికి రజనీష్‌ను ఏపీ ప్రభుత్వం కనిపెట్టగలిగింది. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక వ్యవహారాల నిపుణుడిగా పేరున్న రజనీష్ అనే వ్యక్తిని కేబినెట్ హోదాతో కొత్త సలహాదారుగా నియమించకున్నారు. ప్రభుత్వానికి నిధుల సమస్య ఉంది. ఎలా నిధులు సమీకరించుకోవాలని.. వనరులన్నింటినీ ఎలా ఉపయోగిచుకోవాలన్నదానిపై రజనీష్ సలహాలు ఇస్తారు. ఆయనకు ఎంత చెల్లిస్తారు.. జీతభత్యాలెంత అన్నదానిపై వివరాలు బహిరంగపరచలేదు.
ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పలువురు సేవల్ని తీసుకుంటుంది. ఎస్బీఐ క్యాప్ సంస్థతో ప్రత్యేకమైన ఒప్పందం చేసుకుంది. వేల కోట్లు అప్పులకు ఇంత అనికమిషన్ మాట్లాడుకుని మరీ ఎస్‌బీఈ క్యాప్ సేవలు పొందుతోంది. ఎస్బీఐ క్యాప్ మధ్యవర్తిగా ఉండి పెద్ద ఎత్తున అప్పులు ఇప్పిచింది కూడా. కార్పొరేషన్ల ఏర్పాటు.. వాటికి ఆస్తుల బదిలీ .. ఆ ఆస్తులను తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం వంటి వ్యవహారాల సలహాలు ఎస్బీఐ క్యాప్వేనన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు బ్యాంకర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో కొత్తగా రజనీష్ కుమార్‌ను సలహాదారుగా నియమించుకున్నట్లుగా తెలుస్తోంది.
అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి ఏపీ ప్రభుత్వం రుణాలు సేకరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో రజనీష్ కుమార్‌కు మంచి పరిచయాలు ఉంటాయని వాటిని ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం అంచనా వేసిటన్లుగా తెలుస్తోంది. గతంలో ప్రభుత్వానికి రూ.70వేల కోట్ల రుణాన్ని అమెరికాకు చెందిన ఓ సంస్థతో ఇప్పిస్తానని ఓ వ్యక్తి వచ్చారు. అయితే ఆయన పెద్ద మొత్తం లో కమిషన్ అడగడం.. కేంద్రం అనుమతి ఇచ్చే అవకాశం లేకపోవడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు రజనీష్ అలాంటి భారీ అప్పులను మేనేజ్ చేసే అవకాశం ఉంది.