ఇటీవల నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తేజ, అటు గరుడవేగ సినీమా తో రాజశేఖర్ మళ్ళీ ఫాం లో కి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.
తేజ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించబోయే సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడట రాజశేఖర్. పీఎస్వీ గరుడ వేగ సినిమా విజయంతో ఉత్సాహంగా ఉన్న రాజశేఖర్ కు ఈ అవకాశం వరించిందని సమాచారం. నేనే రాజు నేనే మంత్రి హిట్ తో జోష్ లో ఉన్న తేజ వెంకీ, రాజశేఖర్ కాంబోలో సినిమాను రూపొందించబోతున్నట్టుగా సమాచారం. ఈ సినిమాకు ‘ఆట నాదే వేట నాదే’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఈ నెలలోనే ఈ సినిమా ఆరంభం అవుతుందని తెలుస్తోంది.