రాజశేఖర్ – జీవితలది అన్యోన్య దాంపత్యం. సూపర్ జోడీ. తెరపైనే కాదు. బయట కూడా. రాజశేఖర్ కోసం జీవిత అప్పుడప్పుడూ ఆపధర్మ దర్శకురాలిగానూ మారిపోతూంటారు. దర్శకులు అలిగి వెళ్లిపోయినప్పుడు జీవిత సినిమాలు పూర్తి సందర్భాలున్నాయి. తాజాగా మరోసారి ఆ పాత్రలోకి వెళ్లిపోతున్నారావిడ.
రాజశేఖర్ హీరోగా.. నీల కంఠ దర్శకత్వంలో ఓ సినిమా మొదలవ్వాల్సివుంది. మలయాళం సినిమా `జోసెఫ్`కి ఇది రీమేక్. స్క్రిప్టు పనులు కూడా పూర్తయ్యాయి. కానీ.. నీలకంఠ ఇప్పుడు ఈ సినిమా నుంచి డ్రాప్ అయ్యాడు. క్రియేటీవ్ విబేధాల వల్లే.. నీలకంఠ ఈ సినిమాని వదిలేశాడని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా బాధ్యతల్ని జీవిత నెత్తిన వేసుకుందని, జీవిత దర్శకత్వంలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోందని సమాచారం.