రాజశేఖర్ కారు ప్రమాదం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ్రస్ట్రీ అయ్యింది. అదృష్టవశాత్తూ ఆయనకేం కాలేదు. కానీ కారు మాత్రం బాగా డామేజ్ అయ్యింది. ప్రమాదం జరిగిన తీరుపై కూడా పలు సందేహాలున్నాయి. టైర్ పంక్చర్ అవ్వడం వల్లే, కారు అదుపుతప్పి డివైడర్ని ఢీ కొందని జీవిత చెబుతున్నారు. అయితే అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
రాజశేఖర్‌కి ప్రమాదాలేం కొత్తకాదు. రెండేళ్ల క్రితం ఇలానే రాజేంద్ర నగర్లో రాజశేఖర్ నడుపుతున్న కారు మరో కారుని ఢీ కొట్టింది. రామిరెడ్డి అనే వ్యక్తి రాజశేఖర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు కూడా. అప్పట్లో రాజశేఖర్‌కి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహించారు. మానసిక ఒత్తిడి వల్లే ఈ ప్రమాదం జరిగిందని అప్పట్లో జీవిత, రాజశేఖర్‌లు పోలీసులకు సర్దిచెప్పారు. రామిరెడ్డి కూడా ఇచ్చిన కేసు వాపసు తీసుకోవడంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది.
కొన్నిరోజులుగా రాజశేఖర్ డ్రైవింగ్ మరీ ప్రమాదకరంగా మారింది. ఈ విషయం రాజశేఖర్ కారు పై నమోదైన చలానాలే చెబుతున్నాయి. ప్రమాదానికి గురైన కారుమీద ఇటీవల 3 చలానాలు నమోదయ్యాయి. మితిమీరిన వేగంతో, ప్రమాదకరంగా బండి నడుపుతుంటే.. స్పీడ్ గన్లు పసిగట్టేస్తాయి. ఆ విధంగా రాజశేఖర్ కారు మూడుసార్లు ట్రాఫిక్ కెమెరాలకు చిక్కింది. ఇప్పుడు కూడా మితిమీరిన వేగంతోనే ప్రమాదం జరిగిఉండొచ్చన్నది ప్రాధమిక అంచనా. మరి పోలీసుల దర్యాప్తులో ఏం తేలుతుందో చూడాలి.