జీవిత, రాజశేఖర్లకు ఏడాది జైలు శిక్ష, రూ. ఐదు వేల జరిమానా విధిస్తూ.. హైకోర్టుకోర్టు తీర్పు వెలువరించింది. అల్లు అరవింద్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో విచారణ జరిపిన కోర్టు.. వారిద్దరూ ఉద్దేశపూర్వకంగా పరువు తీసేలా వ్యాఖ్యలు చేశారని నిర్ధారించింది. అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది. అయితే అప్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అప్పటి వరకూ శిక్ష అమలు నిలిపివేశారు. వేగంగా అప్పీలు చేసుకుని ఉపశమనం పొందకపోతే జీవిత, రాజశేఖర్ ఇద్దరూ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయనపై, ఆయన వ్యక్తిత్వంపై దాడి చేసిన వారిలో జీవిత, రాజశేఖర్ కూడా కీలకం. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో వారు చెలరేగిపోయారు. అనేక రకాల ఆరోపణలు చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను సీన్ లోకి తెచ్చి ప్రజల నుంచి రక్తం సేకరించి అమ్ముకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల పై మనస్థాపం చెందిన అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు కోర్టు వారికి శిక్ష వేసింది.
వైఎస్ ఆర్ రెడ్డిని నమ్ముకున్నవారిలో కాస్త ఆలస్యంగా ఎక్కువ మంది జైలు పాలవుతున్నారు. అధికారులు ఎంతో మంది జైలుకెళ్లారు. అధికారం అండతో తామున్నామన్న భరోసాతో రాజకీయ లబ్ది కోసం ఇతరులతో తప్పుడు పనులు చేయించడం కామన్ గా మారింది. కాస్త ఆలస్యంగానైనా తాత్కలిక లబ్ది కోసం తప్పుడు పనులు చేసిన వారు ఇప్పుడు శిక్షలు అనుభవించాల్సి వస్తోంది. అప్పుడైనా ఇప్పుడైనా పెద్దగా తీరు మారడంలేదు.