గరుడవేగతో… మళ్లీ రాజశేఖర్ టచ్లోకి వచ్చాడు. మంచి కథ వస్తే – రాజశేఖర్ తో హిట్టు కొట్టచ్చన్న నమ్మకం పరిశ్రమకు కలిగింది. కల్కి కూడా మంచి వసూళ్లనే అందుకుంది. ఇప్పుడు `శేఖర్`గా మారాడు. మలయాళ చిత్రం జోసెఫ్ కి ఇది రీమేక్. జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించారు. చిత్రీకరణ దాదాపుగా పూర్తయ్యింది. త్వరలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా శేఖర్ ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు.
అరకు శివార్లలోని తోట బంగ్లాలో వృద్ధ దంపతుల హత్య జరుగుతుంది. ఈ హత్య కేసుని ఇన్వెస్ట్ చేయడానికి శేఖర్ ని రంగంలోకి దింపుతుంది ప్రభుత్వం. శేఖర్ గా రాజశేఖర్ లుక్ కొత్తగా ఉంది. తెల్ల జుత్తు, తెల్ల గడ్డంతో.. ఇది వరకు చూడని రాజశేఖర్ కనిపిస్తున్నాడు. మర్డర్ మిస్టరీలకు… మార్కెట్ లో మంచి గిరాకీ ఉంది. థియేటరికల్ రిలీజ్ కి ఛాన్స్లేకపోయినా, ఓటీటీల రూపంలో మంచి డబ్బులు వస్తున్నాయి. కచ్చితంగా ఓటీటీ మార్కెట్ ని ఆకర్షించే కంటెంట్… ఈ సినిమాలో ఉందనిపిస్తోంది. ఎలాగూ మలయాళంలో హిట్ కాబట్టి – తెలుగులోనూ వర్కవుట్అయ్యేఅవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. థీమ్ మ్యూజిక్, విజువల్స్… ఇవన్నీ ఈ గ్లిమ్స్ ని నిలబెట్టాయి. మొత్తానికి మరో ఆసక్తికరమైన థ్రిల్లర్ రాబోతోందన్న సంకేతాల్ని ఈ గ్లిమ్స్ద్వారా చేరవేయగలిగారు. ఫైనల్ అవుట్ పుట్ ఎలా ఉంటుందో చూడాలి.