ప్రవీణ్ సత్తారు.. వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం సాగిస్తున్న దర్శకుడు. చందమామకథలు సినిమాకి జాతీయ అవార్డు కూడా దక్కింది. ఆ వెంటనే గుంటూర్ టాకీస్ అంటూ ఓ మాస్ సినిమా తీసి.. అందర్నీ షాక్‌కి గురిచేశాడు. ఇప్పుడు మరోసారి షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ప్రవీణ్ సత్తారు.. ఇప్పుడు రాజశేఖర్ కోసం ఓ కథ సిద్ధం చేసుకొన్నాడట. ఈ కథని రాజశేఖర్‌కి వినిపించడం, ఆయన ఓకే అనేయడం జరిగిపోయాయట. ఇందులో రాజశేఖర్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడట.
అసలే రాజశేఖర్‌ని జనాలు మర్చిపోతున్నారు. ఈ దశలో ప్రవీణ్‌కి రాజశేఖర్‌తో సినిమా చేయాలని ఎందుకు అనిపించింది? అని అడిగితే ”నేను రాసుకొన్న పోలీస్ పాత్రలో రాజశేఖర్ తప్ప ఇంకెవ్వరూ యాప్ట్ అవ్వరు” అంటున్నాడు. సినిమాల కోసం అవకాశాల కోసం రాజశేఖర్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాడు. కొన్ని అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతున్నాయి. దర్శకుడు శ్రీవాస్… రాజశేఖర్‌ని విలన్‌గా చూపించడానికి రెడీ అయ్యాడు. ఇప్పుడు ప్రవీణ్ సత్తార్.. రాజశేఖర్లో హీరోని ఇంకా చూస్తూనే ఉన్నాడు. రాజశేఖర్‌కి మంచి రోజులు మొదలైనట్టే అనిపిస్తోంది మరి.