ఇటీవల కరోనా తో రాజశేఖర్ ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబ సభ్యులందరికీ కరోనా సోకడం, రాజశేఖర్ సైతం కరోనా బారీన పడడం కలవరపెట్టాయి. ముఖ్యంగా అందరికీ నయం అయినా, రాజశేఖర్ మాత్రం ఇంకా ఆసుపత్రిలోనే ఉండడం చర్చనీయాంశమైంది. రాజశేఖర్ పరిస్థితి క్లిష్టంగా మారిందని వార్తలొచ్చాయి. అయితే.. ఇప్పుడు రాజశేఖర్ కరోనాని జయించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి.. ఇంటికి చేరుకున్నారు. ఆయన ఇంటికొచ్చిన ఫొటోని… కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో విడుదల చేశారు. “ఓ దశలో ఆయన పరిస్థితి క్లిష్టంగా మారింది. ఆ సమయంలో చాలా భయం వేసింది అయితే వైద్యులు ఆయన్ని కాపాడారు“ అంటూ ఇటీవల రాజశేఖర్ ఆరోగ్యం విషయంలో జీవిత స్పందించిన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజులు రాజశేఖర్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకోనున్నారు. ఆయన కనీసం 14 రోజుల పాటు హోం క్వారెంటైన్‌లోనే ఉంటారని తెలుస్తోంది.