ప్రేమ ఇష్క్ కాదల్ తో ఆకట్టుకొన్న దర్శకుడు పవన్ సాదినేని. ఆ తరవాత సావిత్రి తెరకెక్కించాడు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తరవాత.. చాలా కాలంగా ఓ కథ పట్టుకొని, ఇండస్ట్రీ మొత్తం తిరుగుతున్నాడు. చివరికి ఈ కథకి ఓ హీరో దొరికేశాడు. తనే రాజశేఖర్. వీరిద్దరి కాంబినేషన్లో త్వరలోనే ఓ స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ పట్టాలెక్కబోతోంది.
రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన చిత్రం `శేఖర్` ఈనెల 20న విడుదల కాబోతోంది. ఆ తరవాత పవన్ సాధినేనితో రాజశేఖర్ ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో రాజశేఖర్ మాఫియా డాన్ గా కనిపించబోతున్నారు. కథ ఇప్పటికే సిద్ధమైంది. ఇటీవల ఫైనల్ నేరేషన్ కూడా ఇచ్చేశారు. ఇదో యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమా అని తెలుస్తోంది. అన్ని రకాల ఎలిమెంట్స్ నీ ఈ కథలో మేళవించారు. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషణ జరుగుతోంది. త్వరలో పూర్తి వివరాలు బయటకు వస్తాయి.