కల్కి తరవాత మళ్లీ మేకప్ వేసుకోలేదు రాజశేఖర్. ఆయనకు `మా` గొడవలు, సొంత వ్యవహారాలతోనే టైమ్ సరిపోయింది. ఈలోగా కొన్ని కథలు విన్నా – ఆసక్తి చూపించలేదు. ఎట్టకేలకు వీరభద్రమ్తో సినిమా ఓకే అయ్యింది. అయితే ఇది కూడా పట్టాలెక్కలేదు. రాజశేఖర్ చేతిలో ఉన్న సినిమా ఇదే. దర్శకుడు వీరభద్రమ్ కూడా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. కథానాయికగా శ్రియ పేరు పరిశీలిస్తున్నారు. రాజశేఖర్ వయసుకి తగిన కథానాయిక కావాలన్నది వీరభద్రమ్ ఆలోచన. పైగా ఆ పాత్ర హుందాగా, గ్లామరెస్గా ఉంటుందట. అందుకే శ్రియని ఎంచుకోవాలని చూస్తున్నారు. ఈ కథలో మరో యువ హీరో కూడా నటించనున్నారు. ఆ హీరో ఎవర్నది ఇంకా తెలీదు. తన పక్కన కూడా ఓ హీరోయిన్ కావాల్సివుంది. ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు.. ఇంకేముంది…? ఈ సినిమాకు కలర్ వచ్చేసినట్టే. కాకపోతే.. రాజశేఖర్ కాస్త సినిమాలపై దృష్టి పెడితే తప్ప ఇది తొందరగా పట్టాలెక్కదు.