యాంగ్రీ యంగ్‌మెన్ రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని ఎప్పటి నుంచో కాచుకొని కూర్చున్నారు. విలన్పాత్రల్లోకి ఎంట్రీ ఇస్తే… జగపతి బాబు రేంజులో తనకు అవకాశాలొస్తాయన్నది రాజశేఖర్ నమ్మకం. అది నిజం కూడా. ఎందుకంటే ఒక్కసారి రాజశేఖర్‌లాంటి నటులు విలన్ పాత్రలో ప్రవేశించి నిరూపించుకొంటే.. ఇక వాళ్ల కెరీర్‌కి తిరుగుండదు. రాజశేఖర్ ని విలన్‌గా ఇంట్రడ్యూస్ చేయాలని దర్శకుడు తేజ భావించాడు. కానీ ఎందుకనో ఆ ప్రాజెక్ట్ ఇంకా కార్యరూపం దాల్చడం లేదు. ఈసారి ఆ బాధ్యతను శ్రీవాస్ తీసుకొన్నట్టు టాక్.
గోపీచంద్ కథానాయకుడిగా శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. కథానాయికగా రకుల్ ప్రీత్‌సింగ్‌ని ఎంచుకొన్నారని టాక్. ప్రతినాయకుడి పాత్ర కోసం రాజశేఖర్‌ని సంప్రదించారు. రాజశేఖర్ కూడా ఈసినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నట్టు టాక్. పారితోషికం కూడా గట్టిగానే డిమాండ్ చేస్తున్నాడట. రాజశేఖర్ ఓకే అంటే ఈ సినిమాకి ఓ సరికొత్త క్రేజ్ వస్తుందని చిత్రబృందం భావిస్తోంది. అందుకే ఆయన అడిగినంత ఇవ్వడానికి కూడా రెడీగానే ఉన్నారు. ఒకట్రెండు రోజుల్లో ఈ కాంబినేషన్ గురించి ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.