గరుగవేగతో ఫామ్‌లోకి వచ్చాడు రాజశేఖర్. కల్కి ఓ మాదిరిగా ఆడుతోంది. బ్యాడ్ సినిమా అయితే కాదు. ఈ సినిమాకి బిజినెస్ బాగానే జరగడంతో రాజశేఖర్‌కి మరింత ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు మరో సినిమా కోసం కసరత్తులు జరుగుతున్నాయి. ఓ హాలీవుడ్ సినిమాపై రాజశేఖర్ దృష్టి పడింది. ఆ సినిమా రైట్స్ తీసుకుని, అఫిషీయల్‌గా రీమేక్ చేయాలని భావిస్తున్నారు. కాకపోతే… హాలీవుడ్ చిత్రబృందాన్ని ఎలా సంప్రదించాలో అర్థం కావడం లేదట. అలాగని… ఆ పాయింట్‌ని ఎత్తేసి తీయడం రాజశేఖర్‌కు ఇష్టం లేదట. చేస్తే అఫీషియల్ రీమేకే చేద్దామని ఫిక్సయ్యాడు.
ఈలోగా `గరుడ వేగ2`కి సంబంధించిన కసరత్తులు కూడా మొదలయ్యాయి. ప్రవీణ్ సత్తారు ఇప్పటికే లైన్ వినిపించాడు. దాన్ని మరింత పకడ్బందీగా తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే `గరుడవేగ`కు మించి ఈ సినిమాకి బడ్జెట్ అవ్వబోతోందని తెలుస్తోంది. అంత బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారా, లేదా? అనేది డౌట్. ఎవరూ రాకపోతే మళ్లీ రాజశేఖరుడే ముందుకు రావాలి.