రచయిత, దర్శకుడు రాజసింహా ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ముంబైలోని ఓ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. రాజసింహా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. రచయితగా తన కెరీర్ కొనసాగించిన రాజసింహా కొన్ని హిట్ చిత్రాలకు పనిచేశారు. రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి పాత్రకు ఆయన కొన్ని సంభాషణలు అందించారు. సందీప్ కిషన్‌తో `ఒక్క అమ్మాయి తప్ప` చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. రచయితగా, దర్శకుడిగా అవకాశాలు కనుమరుగయ్యాయి. దాంతో గతేడాదిగా రాజసింహా తీవ్ర మానసిక వేదనతో సతమతమవుతున్నారని, అందుకే ఆత్మహత్యకు ప్రయత్నించారని తెలుస్తోంది.