జ్యోతిరాదిత్య సింధియాలాగా మారిపోదామనుకున్న రాజస్థాన్ సచిన్ పైలెట్.. క్రాష్ ల్యాండిగయ్యే ప్రమాదం నుంచి.. తప్పించుకున్నారు. సొంత పార్టీ కాంగ్రెస్‌తో రాజీ చేసుకునే ప్రయత్నం చేసి.. తాను.. తన వర్గ ఎమ్మెల్యేల పదవుల్ని కాపాడుకునేందుకు సిద్ధమయ్యారు. సేఫ్ ల్యాండింగ్కే మొగ్గు చూపారు. రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల్లో ప్రారంభం కానున్న సమయంలో.. అనూహ్యంగా సచిన్ పైలట్.. రాహుల్, ప్రియాంకా గాంధీలతో సమావేశమయ్యారు. అటు జైపూర్‌లో… సచిన్ పైలట్ వర్గ నేత నేరుగా ముఖ్యమంత్రితో సమావేశమై.. తమ లీడర్ .. గెహ్లాట్ అనే ప్రకటించారు. దీంతో.. సచిన్ పైలట్ … రిటర్న్స్ అని తేలిపోయింది.
అసెంబ్లీ సమావేశం జరిగితే… సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలందరిపై అనర్హతా వేటు పడటం ఖాయం. అదే సమయంలో… గెహ్లాట్ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ ఉండదు. ప్రభుత్వం నిలబడి.., తమపై అనర్హతా వేటు పడితే.. పద్దెనిమిది మంది రాజకీయ భవిష్యత్కే గండి పడుతుంది. తాను ఫెయిలైన నేతగా మిగిలిపోతారు. ఓ వైపు రాజస్థాన్ బీజేపీలో పైలట్‌ను ఆహ్వానించే పరిస్థితులు లేవు. అక్కడ వసుంధరాజే … పైలట్‌తో పని చేసేందుకు సిద్ధంగా లేరు. ఈ పరిణామాలన్నింటితో.. కాంగ్రెస్‌లోనే ఉంటే భవిష్యత్ బాగుంటుందని అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో ఆయన మిత్రుడైన రాహుల్‌తో భేటీ అయ్యారు.
మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేసి.. ప్రభుత్వాన్ని కూల్చేసి… బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పారు. రేపోమాపో జరగబోయే.. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో.. ఆయనకు పదవి వస్తుందని చెబుతున్నారు. పైలట్ ను కూడా.. చేర్చుకుని… రాజస్థాన్‌లోనూ ప్రభుత్వాన్ని మార్చి… ఆయననూ కేంద్రమంత్రిని చేయాలనుకున్నారు. కానీ.. రివర్స్ అయింది. బీజేపీ ఆపరేషన్ ఫెయిలయింది. తర్వాత బేరసారాలన్నీ మళ్లీ ఫ్రెష్‌గా పూర్తి చేసుకుని మళ్లీ ప్రయత్నిస్తారేమో కానీ ఇప్పటికైతే సద్దుమణిగింది.