నితిన్ హీరోగా నటించిన సినిమా రాబిన్హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం. ఇందులో రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించడం మరో ఆకర్షణ.
ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి వార్నర్ ని తీసుకురాగలిగారు నిర్మాతలు. ఈవెంట్ బాగానే జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ వార్నర్ ని ఉద్దేశించి ‘వాడు.. వీడు.. మామూలోడు కాదు.. ఇలా ఏక వచనంలో సంభోదించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రాజేంద్ర ప్రసాద్ వివరణ ఇచ్చుకుంటూ తాజాగా ఓ వీడియోని రిలీజ్ చేశారు.
ఐ లవ్ డేవిడ్ వార్నర్. ఐ లవ్ హిస్ క్రికెట్. డేవిడ్ వార్నర్ కి మన సినిమాలు, యాక్టింగ్ అంటే ఇష్టం. మేము చాలా క్లోజ్ అయ్యాం. ఏదేమైనా జరిగిన సంఘటన మీ మనసుకి బాధపెట్టినట్లయితే సారీ. నేను నిజంగా ఉద్దేశం పూర్వకంగా అన్నది కాదు. అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ. నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను’ అని జరిగిన వివాదాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు రాజేంద్రప్రసాద్.