తన సినిమాలతో నవిస్తూ కవ్విస్తూ వస్తున్న రాజేంద్రప్రసాద్ ఇప్పుడు మళ్లీ కెరియర్ లో కొత్త ఊపందుకున్నాడు. హీరోగానే కాదు సపోర్టింగ్ రోల్స్ లో ఎప్పటినుండో నటిస్తూ వస్తున్న రాజేంద్రుడు ఇప్పుడు సరికొత్తగా ప్రతినాయకుడిగా మారబోతున్నాడట. చేసే ఏ పాత్రకైనా న్యాయం చేయగల సత్తా ఉన్న విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్.. అందుకే ఆయన్ను ఇప్పుడు ప్రతి నాయకుడిగా కూడా మార్చబోతున్నారు దర్శక నిర్మాతలు. ఈమధ్యే ఓ స్టార్ డైరక్టర్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ను విలన్ గా పెట్టేందుకు రంగం సిద్ధం చేశాడట.
స్క్రిప్ట్ విన్న రాజేంద్ర ప్రసాద్ విలన్ గా కూడా ఓకే అన్నట్టు తెలుస్తుంది. తన కెరియర్ లో ఎన్నో రకరకాల పాత్రల్లో అలరించి మెప్పించిన రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు విలన్ గా మారడం ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న రాంజేంద్ర ప్రసాద్ ఇప్పటిదాకా పాజిటివ్ రోల్స్ లో చేయడమే జరిగింది. మొదటిసారి తన కెరియర్ లో పూర్తి స్థాయి విలన్ గా చేయడం ఇదే మొదటిసారి. ఇక ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలను త్వరలో వెళ్లడించే అవకాశాలున్నాయి.