మూడేళ్ల నుంచి రవిబాబు చెక్కుతున్న సినిమా `అదిగో`. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తారు. ఇది ఓ పంది పిల్ల నేపథ్యంలో సాగే సరదా కథ. పందికి `బంటి` అనే పేరు పెట్టారు. ఈ బంటీకి రాజేంద్రప్రసాద్ గాత్రదానం చేశారు. బంటి మనసులో అనుకునే మాటలు.. రాజేంద్రప్రసాద్ నోటి నుంచి వినిపిస్తాయన్నమాట. ఇదో త్రీడీ యానిమేషన్చిత్రం. ఇండియాలోనే ఇప్పటి వరకూ ఇలాంటి ప్రయత్నం చేయలేదని చిత్రబృందం చెబుతోంది. చాలా ఏళ్ల నుంచీ ఈ సినిమా సెట్స్‌పైనే ఉండిపోయింది. సినిమా పూర్తయి కూడా చాలా రోజులైంది. మంచి రిలీజ్‌డేట్ కోసం ఇన్నాళ్లూ చిత్రబృందం ఎదురుచూసింది. ఇప్పుడు ఈసినిమాకి కొన్ని హంగులు అద్ది, కమర్షియల్ గానూ వర్కవుట్ అయ్యేలా జాగ్రత్త పడుతున్నారు. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ విడుదల చేస్తున్నారు కాబట్టి.. బడ్జెట్‌పరంగా చూసుకున్నా పైసా వసూల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.