రోబో సీక్వెల్ కు రెడీ అయిన రజినికాంత్ సినిమా మీద ఎటువంటి బ్యాడ్ టాక్ రాకుండా ఉండేలా జాగ్రత్త పడాలని దర్శకుడు శంకర్ ని హెచ్చరించాడని సమాచారం. రోబో సీక్వల్ గా వస్తున్న రోబో 2.0 సినిమా మొన్నీమధ్యే చిత్రీక్రణ మొదలైంది. అయితే సినిమాలో ప్రతి నాయకుడి మీద మీడియాలో జరుగుతున్న చర్చ విషయం సూపర్ స్టార్ రజిని దాకా వెళ్లడంతో సినిమాకు ఏ రకమైన యాంటీ పబ్లిసిటీ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శంకర్ కి చెప్పాడట.
అంతేకాదు సినిమా గురించి ఎటువంటి వార్త బయటకు రాకుండా చూసుకునేలా కార్యచరణలు చేపట్టమని అన్నాడట. సినిమా మీద మరి ఎక్కువ హైప్ వచ్చేలా చేస్తూనే తగిన జాగ్రత్తలు వహించాలని అన్నారట రజిని. ఈ మధ్య రజిని చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోయాయి. ఆ కారణం చేతే సినిమా గురించి చాలా జాగ్రత్త వహిస్తున్నాడు తలైవా.
దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విజువల్ ఫీస్ట్ గా ఉండేందుకు శంకర్ తన టీంతో చాలా కృషి చేస్తున్నారు. ఎమీ జాక్సన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి మొదలవుతుంది.