వక్ఫ్ బిల్లుపై ముస్లింలను నమ్మించేందుకు వైసీపీ నానా తంటాలు పడుతోంది. పార్టీ నాయకత్వం ఇచ్చిన డైరక్షనో ఏమిటో కానీ , విడదల రజిని వక్ఫ్ చట్టసవరణకు వ్యతిరేకంగా చిలకలూరి పేటలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని హంగామా చేశారు. వైసీపీ డబుల్ స్టాండర్డ్ రాజకీయాలను అంచనా వేసిన కొంతమంది ర్యాలీలో ఆమె భాగస్వామ్యాన్ని వ్యతిరేకించారు.
విడదల రజిని వెళ్లిపోవాలని కొంతమంది ముస్లింలు కోరారు. అయినప్పటికీ ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు. శాంతియుతంగా కొనసాగుతున్న ఈ ర్యాలీ ట్రాక్ తప్పే అవకాశం ఉండటంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. శాంతిభద్రతలు దెబ్బతినే అవకాశం ఉందని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించినా పట్టించుకోలేదు. కేసులు పెట్టుకుంటారా.. ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి అంటూ పోలీసులనే రెచ్చగొట్టారు.
పోలీసులు చెప్పినా,కొంతమంది ముస్లింయువకులు చెప్పినా రజిని మాత్రం ర్యాలీ నుంచి వెనుదిరిగే ప్రసక్తే లేదని మొండికేసింది. దీంతో ముస్లింవర్గాలు రెండుగా చీలిపోవాల్సి వచ్చింది. ఆమెకు మద్దతునిచ్చే వారు ఓ వర్గం, వ్యతిరేకులు మరో వర్గంగా చీలిపోయి అనంతరం ర్యాలీ నిర్వహించారు.
అప్పటివరకు ఐకమత్యంగా ర్యాలీ నిర్వహించిన ముస్లింలు రజిని ప్రవేశంతో రెండువర్గాలుగా చీలిపోవడం చూసి ,వైసీపీకి కోరుకునేది ఇదే అంటూ రజినిపై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే వక్ఫ్ బిల్లు విషయంలో వైసీపీ డ్రామాలు మెల్లగా బయటకు వస్తున్నాయి. లోక్ సభలో వ్యతిరేకంగా ఓటేశారు. రాజ్యసభలో మాత్రం సగం మంది ఎంపీలు బలపరిచారు. నలుగురు వైసీపీ రాజ్యసభ ఎంపీలు బిల్లుకు మద్దతిచ్చినట్లుగా తేలింది.
తీరా,ఓటింగ్ అయిపోయిన తర్వాత సుప్రీంలో పిటిషన్ వేసినట్లుగా, న్యాయస్థానంలో పోరాడుతున్నట్లు కలరింగ్ ఇస్తూ.. ఇక్కడేమో ముస్లిం సమాజాన్ని వర్గాలుగా ఛీల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.