సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాన్స్ దేవుళ్లు ఆదేశించే టైమ్ వచ్చినట్టుంది. లేటెస్ట్ గా తమిళనాడులో జరిగిన ఓ ఈవెంట్ రజనీ రాజకీయ ఎంట్రీని మరోసారి తెరపైకి తెచ్చింది. చెన్నై వరదబాధితుల సాయం కోసం.. తమిళనాడులోని రజనీ ఫ్యాన్స్.. ఓ భారీ ప్రోగ్రాం చేపట్టారు. మలరాట్టం మనుతనేయం (తెలుగులో వర్ధిల్లుతున్న మానవత్వం) అనే ఈవెంట్ కండక్ట్ చేశారు. ఆర్కెస్ట్రాలు, మ్యూజిక్ , డ్యాన్స్ లతో అదరగొట్టారు. ఈ ప్రోగ్రాం ద్వారా వచ్చిన డబ్బుని చెన్నై వరద బాధితులకు సాయంగా అందించనున్నారు.
ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటంటే.. చాలా రోజుల తర్వాత రజనీ ఫ్యాన్స్ ఇంత భారీ ప్రోగ్రాం చేపట్టారు. ఇసుకేస్తే రాలనంత మంది అభిమానులు వచ్చారు. వరదలో సర్వం కోల్పోయిన వారికి తమవంతు సాయం అందించారు. ఇదంతా తలైవా పిలుపు కోసం ఆలోచించకుండా చేశారు. ఈ ప్రోగ్రాం జరిగిన విధానం చూస్తే.. ఓ రాజకీయ పార్టీ మీటింగ్ లా సాగింది. ఈవెంట్ లో 150 అడుగుల రజనీ కటౌట్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అయిపోవాల్సిందే. చాలా రోజుల తర్వాత తమిళనాటు.. మరోసారి ఇంత భారీ కటౌట్లు పెట్టారు. ఈ హడావిడి అంతా చూస్తే.. టోటల్ పొలిటికల్ మీటింగ్ సెట్టింగ్ లా కనిపించింది.
ఇప్పటికే చెన్నై వరద బాధితుల కోసం 10 కోట్లు ఇచ్చాడు తలైవా. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. అయితే ఈ ప్రోగ్రాంని ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడమే.. తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. ఆడంబరాలకు దూరంగా ఉండే.. సూపర్ స్టార్ కూడా.. దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ట్విస్ట్. ఇదంతా 2017 లో జరగబోతున్న తమిళనాడు ఎన్నికలకు ముందస్తు ప్రిపరేషన్సేనా అనే డౌట్ కూడా తమిళ తంబీలకు కలుగుతోంది. ఇప్పటివరకు రాజకీయ అరంగేట్రం గురించి అడగ్గానే తన స్టైల్లో ఓ నవ్వు నవ్వి ఊరుకునేవాడు రోబో. ఇప్పుడు కూడా అలాగే నవ్వి ఊరుకుంటాడా.. లేకపోతే.. ఫ్యాన్స్ ఆదేశించారు.. అరుణాచలం పాటిస్తాడంటూ.. రాజకీయ రంగంలోకి దిగుతాడా చూడాలి.