రజనీకాంత్ కబాలి విడుదలకు ముందు ఎంత సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లెద్దు. ఈసారి రజనీ సినిమా ఆల్ ఇండియా రికార్డులు సృష్టించడం ఖాయమనేసుకొన్నారు అభిమానులు. అయితే కబాలి సినిమా అందరినీ నిరుత్సాహంలో ముంచేసింది. రికార్డు వసూళ్ల మాట దేవుడెరుగు… కొన్నవాళ్లంతా సగానికి సగం నష్టపోయారు. ఆ నష్టాల్ని భర్తీ చేయడానికేమో.. కబాలి బృందం సూపర్‌ప్లాన్ వేసింది. కబాలి సినిమాలో రజనీ కాంత్ వేసుకొన్న సూటూ, కోటు, కళ్లజోళ్లు. నడిపిన కారు ఇవన్నీ వేలం వేయబోతున్నార్ట. ఎవరు ఎక్కువ రేటు పలికిస్తారో.. వాళ్లదే ఆ వస్తువు. రజనీ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. రజనీ అంటే పడిచస్తారు వాళ్లంతా. ఇప్పుడు వాళ్లకు ఇంతకంటే స్వీట్ న్యూస్ మరొకటి ఉండదు.
కబాలి ఫ్లాప్ అయినా ఆ సినిమాలోని కాస్ట్యూమ్స్‌కి మంచి పేరే వచ్చింది. పైగా రజనీకాంత్ వాడిన దుస్తులాయె. ఇక ఫ్యాన్స్ అంతా ఎగబడడం ఖాయం. అన్నట్టు ఇది వరకు చంద్రముఖి సినిమాలో రజనీ వాడిన డ్రస్సులు కూడా ఇలానే వేలం వేశారు. ఆ డబ్బుని సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించారు. మరి ఈసారేం చేస్తారో చెప్పనేలేదు.