రాజ్యాంగం మనకు కొన్ని ప్రాథమిక హక్కులు ఇచ్చింది. అలాంటి వాటిలో వాక్ స్వేచ్చ కూడా ఉంది. మీడియా సంస్థలకు తమకు తెలిసిన సమాచారాన్ని ప్రజలకు తెలియచేసే హక్కు ఉంది. కానీ ఇలా తెలియచేసినందుకు ఎఫ్ఐఆర్లు పెడతారా ?. అంటే పెడతారు.. తెలంగాణ పోలీసులు .. తమకు బాగా తెలిసిన వాళ్లు వచ్చి ఫిర్యాదు చేస్తే కనీస విచారణ లేకుండా.. అందులో తప్పేముందో చూడకుండా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారు. వెల్లల చెరువు రజనీకాంత్ అనబడే టీవీ9 జర్నలిస్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలుగు 360తో పాటు మరికొన్ని డిజిటల్ మీడియా ల్లో వచ్చిన కథనాలపై సైబర్‌క్రైమ్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తెలిసిన సమాచారం చెప్పడం నేరం ఎలా అవుతుంది ?
డిజిటల్ మీడియాలో తెలుగు 360 ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తెలిసిన సమాచారాన్ని నిర్భయంగా ప్రజల ముందు ఉంచుతుంది. ఈ క్రమంలో మీడియాలో ఉన్న ప్రముఖ వ్యక్తుల తప్పుడు వ్యవహారాలనూ వదల్లేదు. రజనీకాంత్ అనబడే జర్నలిస్టు .. ఎలా పక్షపాతంగా వ్యవహరించారో ప్రజలకు తెలుసు. ఆయనపై తెలిసిన విశ్వసనీయ సమాచారాన్ని తెలుగు 360 ప్రజలకు చెప్పింది. అది తప్పుడు ప్రచారం అంటూ ఆయన నేరుగా సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టేశారు. అదే రజనీకాంత్ అలాంటి వార్తలు వందలకొద్దీ రోజూ తన చానల్లో వేయిస్తారన్న చిన్న డౌట్ ఆ ఎస్ఐకి రాలేదు. బహుశా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే తనపైనా అదే చేస్తారన్న భయంతో ముందూ వెనుక ఆలోచించకుండా ఎఫ్ఐఆర్ కట్టారేమో..?
సీఎం రేవంత్ రెడ్డికి లేని ప్రివిలేజ్ రజనీకాంత్‌కు ఎలా వచ్చింది ?
తప్పుడు ప్రచారం జరుగుతోందని సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసిన ఇదే రజనీకాంత్ తన చానల్లో ఎంత మంది పై నిజమైన తప్పుడు ప్రచారాలు చేశారో చెప్పాల్సిన పని లేదు. ఎవరెవరో ఎందుకు ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డిపై టీవీ9 చానల్లో… రజనీకాంత్ నేతృత్వంలో జరిగిన వ్యక్తిత్వ హనన కుట్రల గురించి బయట ప్రపంచానికి తెలియదా ?. రేవంత్ రెడ్డిపై ఆయన రాజకీయ ఎదుగుదలపై ప్రతి దశలోనూ కుట్ర పూరిత వార్తలు వేసింది నిజం కాదా ?. రేవంత్ సీఎం అయిన తర్వాత కూడా తప్పుడు వార్తలు ఆపారా ?. రాజ్యాంగం ఇచ్చిన హక్కును ఇలా వాడుకుంటూ.. ఇతర మీడియా సంస్థలను మాత్రం ఎలా బెదిరిస్తారు ?. సీఎం రేవంత్ రెడ్డికి లేని ప్రివిలేజ్ ను పోలీసులు రజనీకాంత్‌కు ఎలా ఇస్తారు ?
సమాచారం తప్పయితే వివరణ పంపాలి !
తెలుగు360 ప్రజలకు ఇచ్చిన సమాచారం తప్పయితే వివరణ పంపాలి. అందులో నిజం లేదని చెప్పుకోవాలి. ఆరోపణలు అబద్దమని వాదించుకోవాలి. కానీ అదేమీ లేకుండా… తప్పుడు ప్రచారం అని పోలీసు కేసులు పెట్టేస్తామని బెదిరిస్తే … అందులో నిజం ఉందని ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు అదే జరిగింది. కనీసం వివరణ పంపకుండా నేరుగా ఎఫ్ఐఆర్లు పెట్టేస్తామని బెదిరించడం అంటే వాటిలో నిజమున్నట్లు అంగీకరించడమే .
ప్రాథమిక హక్కులపై కేసులు పెట్టడం రాజ్యాంగ ఉల్లంఘన
సదసు ఎస్ఐకి రాజ్యాంగంపై.. ప్రాథమిక హక్కులపై అవగాహన ఉందో లేదో కానీ… రజనీకాంత్ అనే వ్యక్తి కూడా మీడియాలోనే ఉన్నాడు. అతను కూడా తనకు తెలిసిన వార్తల్నే ప్రసారం చేస్తున్నాడు. తెలుగు360 అతని మీద వార్త రాస్తే అతనికి నొప్పి తెలిసి ఉండవచ్చు..కానీ ఆ హక్కు.. రాజ్యాంగం ఆయనకు ఇచ్చినట్లే మీడియాకు ఇచ్చింది. ఇప్పుడు ఆయన ఫిర్యాదు చేస్తే ముందూ వెనుకా ఆలోచించకుండా ఎఫ్ఐఆర్ పెట్టడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనే. ఇాలాంటి ఎఫ్ఐఆర్లపై న్యాయస్థానాలు ఎన్నో సార్లు చీవాట్లు పెట్టినా పోలీసులు మాత్రం తీరు మార్చుకోవడం లేదు.