తమిళనాట మరో రాజకీయ వివాదం చెలరేగుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరందుకోవడం దీనికి కారణం. అదే సమయంలో రజనీకాంత్ ఈరోజు ప్రధానితో సమావేశం కానుండడం దీనికి మరింత ప్రాధాన్యతనుతెచ్చిపెట్టింది. కోయంబత్తూరులో రజనీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన స్థానికతపై వివాదాన్ని రేపారు. ఆయన తమిళుడు కాడనీ, కన్నడిగుడనీ కొందరు ఆరోపిస్తున్నారు. చెన్నైలోని రజనీ నివాసం దగ్గరకు ఆందోళనకారులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. తమిళ సంఘాలు ఆందోళనకుదిగడం సహజంగానే ఆసక్తిని రేకెత్తిస్తోంది. రజనీకాంత్ తమిళరాజకీయాల్లోకి రాకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయంగా ఎంతో ఎదిగిన తమిళనాడులో ప్రస్తుత పరిణామాలు రజనీ రాజకీయ ప్రవేశం ఖాయమేనని చెబుతున్నాయి.