సూపర్ స్టార్ రజనీకాంత్‌కు తప్పనిసరగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనన్న డిమాండ్ సోషల్ మీడియాలో ఉద్దృతంగా సాగుతోంది. ఒక్క తమిళ్ నుంచే కాదు..తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా ఈ డిమాండ్ వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి అనే పేరు కూడా రజనీ ఎత్తలేదు. తన మిత్రుడ్ని పొగిడారు. అదేదో మహా పాతకం అయినట్లు రజనీకాంత్ ను అత్యంత దారుణంగా దుర్బాషలు ఆడుతున్నారు వైసీపీ నేతలు. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇదేం సైకో రాజకీయమన్న ప్రశ్న ప్రతీ చోటా వస్తోంది. అందుకే జగన్ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది.
తమ ప్రత్యర్థుల్ని పొడిగినా తట్టుకోలేనంత సైకోయిజానికి దిగజారిపోయిన వైసీపీ
సహజంగా రాజకీయాల్లో కనిపించని ఓ కట్టు బాటు ఉంటుంది. అదేమిటంటే ఎవరైనా తమను విమర్శిస్తేనే తిరిగి విమర్శించాలని అనుకుంటారు. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధంలేనివారు. సెలబ్రిటీలు అయినా మరొకరు అయినా తమకు ఉన్న వ్యక్తిగత అనుబంధాల రీత్యా.. తమ ప్రత్యర్థుల్ని పొగిడితే ఇతర పార్టీలు పట్టించుకోవరు. తమను విమర్శిస్తే మాత్రం ఎదురుదాడి చేస్తాయి . తమ ప్రత్యర్థిని పొగిడేసి వెళ్లిపోతే పట్టించుకోరు. ప్రో వైసీపీ మీడియాకు కూడా టీడీపీ నేతలు అదే చాలా సార్లు చెప్పారు. జగన్ మీకు అంతగా నచ్చితే ఆయనను పొగుడుకోండి అంతే కానీ తమపై తప్పుడు ప్రచారాలు చేయవద్దని చెప్పారు. అయితే అలాంటి నైతిక నియమాలు.. ఆ ప్రో వైసీపీ మీడియాకే కాదు.. వైసీపీకి కూడా లేవు. అందుకే రజనీకాంత్ విషయంలో వైఎస్ఆర్సీపీ అన్నింటినీ తెంచేసుకుంది.
ఆదేశాలు లేకుండా ఒక్కరూ నోరు మెదపరు – అది జగన్ వికృతమే !
వైసీపీలో రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఎవరైనా సరే నోరు తెరవాలంటే పై నుంచి ఆదేశాలు రావాలంతే. “ఇదిగో అమ్మాయి జగన్ గారు చంద్రబాబు గట్టిగా తిట్టమంటున్నారు” అని ఓ ప్లీనరీలో మైక్ ముందే రోజాతో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పిన మాట .. ఇప్పటికీ అంతర్గతంగా వినిపిస్తూనే ఉంటుంది. అలా రజనీకాంత్ చంద్రబాబును పొగిడిన తర్వాత తమ పార్టీలో నోటి విరేచనాలు చేసుకునే నేతలందరికీ ఈ ఆదేశాల వెళ్పిపోయింది. అందుకే అందరూ అసలు సూపర్ స్టార్ రజనీకాంత్ ఏమన్నారో కూడా పట్టించుకోకుండా మొరిగేశారు. ఆయన స్థాయి ఏంటి.. తమ స్థాయి ఏంటి అన్నది పట్టించుకోలేదు.
జగన్ మానసిక వికృతాన్ని సంతృప్తి పరిచి పదవులు పొందాలనుకునేవారి వైపరీత్యమే ఇదంతా !
సొంత బావమరిదిని అడ్డంగా మోసం చేసిన కాళహస్తి ఎమ్మెల్యే బియ్యం మధుసూదనరెడ్డి దగ్గర్నుంచి రోగి రమేష్ గా అనుచరులతోనే ఛీత్కారం పొందే జోగి రమేష్ వరకూ .. చాలా మంది రజనీకాంత్ పై పడ్డారు. వీరందరి అర్హత అలా తిట్టడమే. జగన్ మానసిక వికృతాన్ని సంతృప్తి పరిచి పదవులు.. ప్రయోజనాలు పొందడంలో వీరంతా రాటుదేలిపోయారు. ఎదురుగా ఉంది రజనీకాంతా..మోదీనా అన్నది వీరు చూసుకోరు. పై నుంచి గట్టిగా తిట్టాలన్న సందే్శం వస్తే చాలు.. తమనను తాము నగ్న విశ్వరూపాన్ని ఆవిష్కరించుకుంటారు.
అసలు నష్టం జగన్ కే…కానీ అహంకారం కళ్లను కప్పేసిందిగా !
ఇలా ముందూ వెనుకా చూసుకోకుండా అందర్నీ తిట్టిస్తే.. ఏమొస్తుంది. అంతిమంగా శత్రువులు పెరుగుతారు. అంతకు మించి ఏమీ దీని వల్ల నష్టం ఎవరికి జగన్ రెడ్డికే. ఆయన మానసిక వికృతం ఇప్పటి వరకూ ఏపీలోనే ఎక్కువ ప్రచారం అయింది. రజనీకాంత్ ఇష్యూతో దేశవ్యాప్తం అయింది.