తమిళ తలైవా, సూపర్‌స్టార్ రజినీకాంత్ సోషల్ మీడియా సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టారు. రజనీకాంత్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ క్రియేట్ చేశారు. “వణక్కం! వందుటెన్ ను సొల్లు… నమస్కారం! వందసార్లు చెప్పినట్టే” అని ‘కబాలి’లో ఫోటోను ఆయన ఫస్ట్ పోస్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ ఆయన అకౌంట్‌కి బ్లూ టిక్ మార్క్ ఇచ్చింది. ఈ అకౌంట్ రజినీదే అని సర్టిఫై చేసిందన్నమాట. ఐదు రోజుల క్రితం రజనీకాంత్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన విషయం… ఈ రోజు అకౌంట్ వెరిఫై అయ్యేవరకూ పెద్దగా ఎవరికీ తెలియలేదు. అభిమానులకు ఈ రోజు తెలియడంతో రజినీని ఫాలో కావడం ప్రారంభిస్తున్నారు. ఆల్రెడీ సూపర్‌స్టార్‌కి ట్విట్టర్ అకౌంట్ వుంది. అందులో 4.58 మిలియన్ ఫాలోయర్స్ వున్నారు. ఇక, ఇన్స్టాగ్రామ్ విషయానికి వస్తే నిమిషం నిమిషానికి ఆయన ఫాలోయర్స్ సంఖ్య పెరుగుతోంది.