లేటు వయసులోనూ… లేటెస్టుగా దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీ కొత్త సినిమా జైలర్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈలోగా లాల్ సలామ్‌ని పట్టాలెక్కించేశాడు రజనీ. ఇటీవల ఇద్దరు తెలుగు దర్శకులు (బాబి, వశిష్ట) చెప్పిన కథకు రజనీకాంత్ ఓకే చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. వీరిద్దరిలో ఒకరి సినిమా పట్టాలెక్కించడం దాదాపుగా ఖాయం. ఇప్పుడు మరో సినిమాకి రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఖైదీ, విక్రమ్ లాంటి చిత్రాలతో బాక్సాఫీసుని హడలెత్తించిన లొకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించడానికి పచ్చజెండా ఊపాడు. ఇటీవల వీరిద్దరి మధ్యా కథా చర్చలు జరిగాయి. లోకేష్ కథ చెబితే.. ఎలాంటి హీరో అయినా ఫ్లాట్ అయిపోతాడు. తన ట్రాక్ రికార్డ్ అలా ఉంది. అందుకే రజనీకాంత్ కూడా కథ విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ చిత్రాన్ని కేజీఎఫ్, కాంతారా లాంటి మాసీవ్ హిట్స్‌ని తెరకెక్కించిన హొంబలే ఫిల్మ్స్ సంస్థ రూపొందిస్తోంది. లాల్ సలామ్ అవ్వగానే ఈ సినిమా మొదలెట్టే అవకాశం ఉంది. రజనీకాంత్ వయసు ఇప్పుడు 70 దాటేసింది. ఈ వయసులోనూ ఆయన యువ హీరోలతో పోటీగా సినిమాలు చేస్తున్నారంటే.. గ్రేటే!