రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న 165వ చిత్రానికి ‘పేట్ట’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్న సినిమా ఇదే! సినిమా మోషన్ పోస్టర్లో టైటిల్‌తో పాటు తలైవా లుక్‌ని చూపించారు. అంత వరకూ బావుంది. కానీ, అసలు చిక్కంతా టైటిల్‌తోనే వచ్చింది. ‘పేట్ట’కి అర్థం ఏమై వుంటుందని తమిళ జనాలు చర్చించుకోవడం విశేషం. తమిళ టైటిల్ కనుక తెలుగువాళ్లకు అర్థం కాలేదంటే ఓ అర్థం వుంటుంది. కానీ, తమిళులకూ టైటిల్‌కి అర్థం ఏంటో అర్థం కాకపోవడమే విచిత్రం! తెలుగులో పల్లెటూళ్లలో నాయుడోరి పేట, హరిజనుల పేట… ఇలా అంటుంటారు కదా! తెలుగులో ‘పేట’ని తమిళంలో ‘పేట్ట’ అంటార్ట! అలాగే, ద్రవిడ భాషలో ‘పేట్ట’ అంటే ‘ప్రత్యేక అధికారం’ అనే అర్థం వుంది! రజనీకాంత్ చిత్రానికి ‘పేట’ అనే అర్థంలో పెట్టారా? లేదా రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో ‘ప్రత్యేక అధికారం’ అనే కాన్సెప్ట్ మీద టైటిల్ పెట్టారా? అని తమిళనాట చర్చించుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే… రజనీ లుక్, మోషన్ పోస్టర్లో అనిరుధ్ రవిచంద్రన్ నేపథ్య సంగీతం అభిమానులకు ఆకట్టుకుంటున్నాయి.