చంద్రబాబును జైల్లో ములాఖత్ అవ్వాలని సూపర్ స్టార్ రజనీకాంత్ అనుకున్నారు. అయితే కుటుంబ కార్యక్రమం కోసం కోయంబత్తూరు వెళ్తున్నందు వల్ల కలవలేకపోయానని ఆయన తెలిపారు. చెన్నై ఎయిర్ పోర్టులో ఆయనే స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరని..ఆయన చేసిన అభివృద్ధి , మంచి పనులు.. మంచితనమే ఆయనకు రక్షగా ఉంటుందని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. రెండు రోజుల కిందట చంద్రబాబుతో ములాఖత్ కోసం రజనీ వస్తున్నారన్న ప్రచారం జరిగింది. తర్వాత అది ఫేక్ అన్నట్లుగా ప్రచారం అయింది. కానీ అది నిజమేనని స్పష్టమయింది.
చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత లోకేష్‌కు రజనీకాంత్ ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. తర్వాత నేరుగా కలవాలనుకున్నారు. నిజానికి గతంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హాజరైనప్పుడు చంద్రబాబును పొడిగినందుకు రోజా సహా అందరూ ఇష్టం వచ్చిటన్లుగా నోరు పారేసుకున్నారు. బూతులు తిట్టారు. ఈ వ్యవహారం సంచలనం అయింది. తర్వాత జైలర్ సినిమా రిలీజ్ సందర్భంగా కుక్కలతో పోల్చి రజనీ చెప్పిన డైలాగ్ వైరల్ అయింది. అది వైసీపీ నేతల్నే అన్నారని ఎక్కువ మంది అనుకున్నారు.
వారు అలా విమర్శల పేరుతో తిట్లు అందుకున్నప్పుడు.. ఇక రజనీకాంత్ ఏపీ జోలికి రారని వైసీపీ నేతలు అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది వేరు. అరెస్ట్ చేస్తే నేరుగా ములాఖత్ కు రావాలనుకున్నారు. తర్వాత అయినా వచ్చే అవకాశం ఉంది. ఇదే సూపర్ స్టార్ అంటే అని టీడీపీ అభిమానులు అభినందిస్తున్నారు.