చావు కబురు చల్లగా చెప్పినట్టు… రజనీకాంత్ అభిమానులకు దర్శకుడు శంకర్ ‘2.0’ గురించి మెల్లగా ఈ రోజు ఒక ట్వీటేశారు. “2.0’ టీజర్ సీజీ వర్క్ లాస్ ఏంజిల్స్‌లోని మాబ్సీన్ సంస్థలో స్పీడుగా జరుగుతోంది. టీజర్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎక్కువ. ఒకసారి ఆ పనులు పూర్తయితే టీజర్‌ను విడుదల చేసేస్తాం” అని ఆ ట్వీటులో శంకర్ సార్ సెలవిచ్చారు. దాంతో అభిమానుల్లో కొత్త డౌట్లు పుట్టుకొచ్చాయి. “టీజర్లో గ్రాఫిక్ వర్క్ పూర్తి కావడానికి ఇంకా టైమ్ పడుతుందటే? ట్రైలర్లో గ్రాఫిక్ వర్క్ ఎప్పుడు పూర్తవుతుంది? సినిమాలోది ఇంకెప్పటికీ పూర్తవుతుంది? జస్ట్ ఆస్కింగ్ అంతే” అంటున్నారు.
అసలు నిన్న విడుదల కావలసిన సినిమా. ఆ మాటకొస్తే… గతేడాది దీపావళికి రావాల్సిన సినిమా. వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ ఏప్రిల్ 14కి తీసుకెళ్లారు. సో… టీజర్, ట్రైలర్ విడుదల తేదీలను కూడా మార్చారని అభిమానులు సర్దుకున్నారు. ఇప్పుడు గ్రాఫిక్స్ పూర్తి కాలేదంటూంటే కొత్త డౌట్లు ఎందుకు రావు? అటువంటి డౌట్లు అన్నీ పక్కన పెట్టొచ్చని ‘2.0’ టీమ్ అంటోంది. అప్పటికి గ్రాఫిక్స్ పూర్తవుతాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే… సమ్మర్ సీజన్ తప్పిస్తే దగ్గర దగ్గరలో అంత మంచి సీజన్ మరొకటి కనిపించడం లేదు. మిగతా సీజన్లలో సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టినా సమ్మర్ సీజన్ తో పోలిస్తే కలెక్షన్స్ తక్కువ వస్తాయి. అదీ మేటర్.