‘జై భీమ్’ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న దర్శకుడు టి.జె. జ్ఞానవేల్. ఇప్పుడాయన రజనీకాంత్ తో ‘వేట్టయన్’ సినిమా తీశారు. ఈ సినిమా ట్రైలర్ బయటికి వచ్చింది. జైభీమ్ లో లాక్ అఫ్ డెత్, ఎన్ కౌంటర్లని నిరసిస్తూ కథనాన్ని రాసిన జ్ఞానవేల్ ‘వేట్టయన్’ కి వచ్చేసరికి రివర్స్ గేర్ వేశాడు. ఎన్ కౌంటర్స్ లో హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ ఈ కథని మలిచాడని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది.
తప్పు చేసినవారిని ఎన్ కౌంటర్లలో చంపేయాలనే పబ్లిక్ డిమాండ్ తో ట్రైలర్ బిగెన్ అయ్యింది. తర్వాత ఒక మర్డర్ ని తెరపైకి తెచ్చారు. అయితే క్రిమినల్ ని గుర్తించడం పోలీసులకు సవాల్ గా మారుతుంది. దీంతో పోలీసుల పనితీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమౌతాయి. ఇక పోలీసులు ఎన్ కౌంటర్ కి దిగుతారు. మూడు రోజుల్లో డిపార్ట్మెంట్ కి మంచి పేరు తీసుకొచ్చేసే ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా రజనీ రంగప్రవేశం చేస్తారు. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్,రానా, మంజు వారియర్ పాత్రలు కీలకంగా కనిపించాయి.
‘క్రైమ్ క్యాన్సర్ లాంటింది. దాన్ని పెరగనివ్వకూడదు’అని రజనీ చెప్పిన డైలాగ్ పేలింది. అధికారాన్ని చేతిల్లోకి తీసుకునే పోలీసు పాత్రగా రజనీ క్యారెక్టర్ ని తీర్చిదిద్దారు. యాక్షన్ సీన్స్ రజనీ మార్క్ లో వున్నాయి. అనిరుధ్ రవిచందర్ బీజీఎం యాక్షన్ ని మరింతగా ఎలివేట్ చేసింది. కథని గ్రౌండడ్ గానే చూపించాడు దర్శకుడు. ‘నా నుంచి వాడ్ని కాపాడటం ఎవ్వరి వల్లా కాదు’ అని రజనీ చెప్పిన డైలాగ్ కొసమెరుపు. అక్టోబర్ 10న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకొస్తోంది.