రజనీకాంత్ కుమార్తె సౌందర్య వెడ్డింగ్ కు వచ్చిన వారికి రజనీకాంత్ ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. `అసలు ఇలాంటి ఆలోచన ఆయనకు ఎలా వచ్చింది` అని అందరూ రిటర్న్ గిఫ్ట్ గురించి చర్చించుకుంటున్నారు. తాంబూలం, పండ్లు, స్వీట్లతో పాటు రజనీకాంత్ అందరికీ ఇచ్చిన సంచుల్లో సీడ్ బాల్స్ ఉన్నాయట. వాటిని శ్రద్ధగా నాటినా.. లేకపోతే మట్టిలో అలా పడేసినా కూడా మొక్కలు మొలుస్తాయట. పర్యావరణానికి మేలు జరిగే దశగా రజనీకాంత్ సతీమణి లత ఆలోచించారట. లత ఈ సీడ్ బాల్స్ గురించి చెప్పగానే కుటుంబసభ్యులందరూ ముక్తకంఠంతో ఓటేశారట. తన కుమార్తె కాపురంతో పాటు నేల తల్లి పచ్చగా ఉండాలని కోరుకుంటూ ఈ రిటర్న్ గిఫ్ట్ లు ఇచ్చినట్టు ఆయన సన్నిహితులు తెలిపారు.