రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామని కేటీఆర్ ప్రకటంచి.. గొప్పగా బెదిరించానని అనుకుంటున్నారు. కానీ వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. అప్పుడు కాంగ్రెస్ తో పొత్తులో ఉంటే… స్వయంగా ఆయనే పూలమాల వేయాల్సి రావొచ్చు. అధికారంలోకి రాకపోతే దానికి కూడా చాన్స్ ఉండకపోవచ్చు. కానీ ఇప్పటికైతే మరో నాలుగేళ్ల పాటు రాజీవ్ విగ్రహం అక్కడే ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ఆన్సర్ చేయాల్సిన అసలు క్వశ్చన్ ఆయనకు పదే పదే ఎదురవుతోంది. అదే తెలంగాణ తల్లి విగ్రహం పదేళ్ల పాటు ఎందుకు పెట్టలేదు ?
సెక్రటేరియట్ ఇటీవల కట్టారు. అందులో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని బీఆర్ఎస్ గతంలో ఎక్కడా చెప్పలేదు. ఓ విగ్రహం కోసం అక్కడ స్థలాన్ని రిజర్వ్ చేశారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నామని రేవంత్ .. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టేందుకు శంకుస్థాపన చేసినప్పుడు కేటీఆర్ విమర్శించడం ప్రారంభించారు. అప్పుడు అందరికీ వచ్చిన డౌట్ … అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేదు ?. అసలు తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడైనా ఉందా ?. బీఆర్ఎస్ సిద్ధం చేసిన విగ్రహం తెలంగాణ భవన్ లో ఉంటుంది కానీ అధికారికంగా ఎక్కడా పెట్టలేదు. అసలు ఆ ఆలోచన కూడా చేయలేదు. దీన్నే రేవంత్ ప్రశ్నిస్తున్నారు.
ఈ అంశాన్ని బీఆర్ఎస్ వినిపించుకోనట్లే ఉంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పదేళ్ల పాటు ఎందుకు పెట్టలేని పరంపరగా వస్తున్న ప్రశ్నలపై కేటీఆర్ వద్ద సమాధానం లేదు. ఆయన రాజీవ్ విగ్రహం తొలగింపుపై మాత్రమే మాట్లాడుతున్నారు. రేవంత్ అసలు ఆ స్థలాన్ని తెలంగాణ తల్లి విగ్రహం కోసం కాదని..కేసీఆర్ విగ్రహాన్ని పెట్టుకునేందుకు రిజర్వ్ చేశారని … అందుకే ఇంత రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. కారణం ఏదైనా తెలంగాణ తల్లి విషయంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ బాగానే హైలెట్ చేస్తోంది. దీనికి కేటీఆర్ వద్ద సమాధానం లేదు.