ఔటర్ రింగ్ రోడ్డుపై… నిన్న తెల్లవారుజామున ఓ వాల్వో కారు బోల్తా పడిన ఘటన.. టాలీవుడ్లో కలకలం రేపింది. హీరో తరుణ్.. ఈ ఘటనలో గాయపడ్డారని… విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే.. వెంటనే తరుణ్‌తో పాటు.. ఆయన కుటుంబం కూడా.. స్పందించింది. తరుణ్ ఇంట్లోనే ఉన్నాడని..బయటకు వెళ్లలేదని… అందువల్ల.. ప్రమాదం జరిగే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. అయితే.. సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి దాచి పెట్టడం సహజమే కాబట్టి.. ఏదో జరిగిందని అందరికీ అర్థమయింది. కాసేపట్లోనే.. అసలు విషయం బయటపడింది. నిజంగానే వాల్వో కారు ప్రమాదంలో తరుణ్ ఉన్నారు… స్వల్పంగా గాయపడ్డారు కూడా… కాకపోతే.. అందరూ అనుకున్న తరుణ్ కాదు.. కారులో ఉన్న రాజ్‌తరుణ్.
రాజ్ తరుణ్ టీఎస్ 09 ఈఎక్స్ 1100 నెంబర్ గల వాల్వో కారులో ఔటర్ పై నుంచి వస్తూ.. నార్సింగి సమీపంలోని అల్కాపూర్ దగ్గర కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఆ తర్వాత కారు దిగి పరారయ్యారు. రాజ్‌తరుణ్ పరుగెడుతున్న దృశ్యాలు సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలో బయటపడ్డాయి. పోలీసులు యీ సీసీ టీవీ ఫుటేజీని సేకరించారు. రాజ్‌తరుణ్.. కారు ప్రమాదం జరిగిన తర్వాత ఎందుకు అలా పారిపోవాల్సి వచ్చిందనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆయన ఎక్కడున్నారో ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.
వాల్వో కారులో అత్యాధునిక.. భద్రతా ఏర్పాట్లు ఉండటంతో.. రాజ్‌తరుణ్‌కు స్వల్పంగా మాత్రమే గాయలయ్యాయి. కారులో పరిస్థితిని బట్టి చూస్తే.. డ్రైవింగ్ రాజ్‌తరుణే చేస్తున్నారు. బెలూన్ బయటకు వచ్చేసి ఉంది. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం.. లేదా.. రేసుల వ్యవహారం ఏమైనా ఉందా … అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఎవరైనా ముందుగా పోలీసులకు సమాచారం ఇస్తారు. కానీ రాజ్‌తరుణ్.. పారియో ప్రయత్నం చేయవడం వల్లే.. ఏదో జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.