అక్కినేని నాగార్జున హీరో గా నటిస్తున్న రాజు గారి గది-2 ట్రలర్ విడుదలైంది. పివిపి నిర్మిస్తూ, ఓం కార్ దర్శకత్వం వహిస్తున్న ఈ కామెడీ థ్రిల్లర్ అక్టొబర్ 13 న విడుదల కానుంది.
ట్రైలర్ అన్ని హారర్ కామెడీ చిత్రాల్లాగే కొంచెం కామెడీ, కొంచెం హారర్ కలగలిసి ఉంది. దెయ్యానికి భయపడి నవ్వులు పూయించే పాత్రల్లో షకలక శంకర్, వెన్నెల కిషోర్ కనిపించగా, దెయ్యం పని పట్టే, ఫేస్ రీడింగ్ తో మనసులో భావాలు కనిపెట్టే “మెంటలిస్ట్” పాత్రలో నాగార్జున కనిపించారు ట్రైలర్లో. ఒక రిసార్ట్ నేపథ్యం లో కథ కొనసాగినట్టు చూపించారు.అయితే ఈ ట్రైలర్ చూస్తే ఆ మధ్య మళయాళం లో రిలీజైన “ప్రేతం” అనే సినిమా కి పోలికలు దగ్గరగా కనిపించాయి.
ప్రేతం కథ ఇలా ఉంటుంది. కాలేజ్ నుంచీ ఫ్రెండ్స్ అయిన ముగ్గురు యువకులు ఒక రిసార్ట్ పెడతారు. అదీ బాగానే నడుస్తుంటుంది. కానీ సడెన్ గా వింత సంఘటనలు, వింత ప్రవర్తనలు మొదలవుతాయి. వీటిని ఛేదించడానికి ఒక సైక్రియాటిస్ట్ కం ఎగ్జార్సిస్ట్ (భూత వైద్యుడు) ని సంప్రదిస్తారు. కామెడీ హారర్ గా సాగ్తున్న ఈ కథ లో సడెన్ గా క్రైం కోణం మొదలవుతుంది. ఒక కాలేజ్ స్టూడెంట్ మర్డర్ మిస్టరీ కి సంబంధించిన ఆ ఇన్వెస్టిగేషన్ సమయం లో పోలీసులకి సాయం చేస్తుంది నాగార్జున పాత్ర. లై డిటెక్టర్ లేకుండానే, ఇన్వెస్టిగేషన్ సమయం లో మనిషి ముఖకవళికలని బట్టి వాళ్ళు చెప్పేది నిజమా అబద్దమా అనేది చెప్పే ఆ పాత్ర మళయాలం లో పెద్ద హిట్టయింది.
ప్రేతం తో పోలికల గురించి ఇప్పుడే చెప్పలేం కానీ, ట్రైలర్ చూస్తే మాత్రం, కామెడీ, హారర్, సమపాళ్ళలో కలగలిసినట్టు కనిపించింది. అలా అన్నీ కరెక్ట్ గా కుదిరి ఉంటే సూపర్ హిట్ గ్యారంటీ. అయితే, సినిమా కోసం మాత్రం అక్టొబర్ 13 దాకా వెయిట్ చేయాల్సిందే!