వైసీపీకి అత్యధికంగా ఎమ్మెల్యేలు రావడం వల్ల ఆ పార్టీకి వచ్చిన మరో అడ్వాంటేజ్ రాజ్యసభ స్థానాలు. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న ప్రతి రాజ్యసభ స్థానం వైసీపీ ఖాతాలోనే పడుతోంది. త్వరలో మరో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నలుగురు ఎవరో వైసీపీలో ఓ క్లారిటీ వచ్చింది. ఒకరు ఖచ్చితంగా ఉత్తరభారతానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఉండబోతున్నారని ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపై క్లారిటీతో ఉన్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ వ్యాపారవేత్త బహుశా అదానీ అయి ఉంటారని లేకపోతే.. రిలయన్స్ గ్రూపులో కీలకమైన నత్వానీ అయినట్లుగా..అదానీకి అత్యంత సన్నిహితుడే అయి ఉంటారని అంచనా వేస్తున్నారు.
అదానీకి ఇప్పటికే పెద్ద ఎత్తున ఏపీలో ప్రయోజనాలు కల్పించారు. పోర్టుల కొనుగోలుకే కాదు.. గంగవరం పోర్టును అతి తక్కువకు ఇచ్చేశారు. ఇప్పుడు రాజ్యసభ సీటు కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. మిగిలిన మూడు సీట్లలో సామాజిక సమీకరణాలు చూసుకుని ఇవ్వాల్సి ఉంది. పదవీ కాలం ముగుస్తున్న వారిలో విజయసాయిరెడ్డి ఉన్నారు. మొదట్లో ఆయనకు రెన్యూవల్ చేయరన్న ప్రచారం జరిగింది. ఆయనకు బదులు సజ్జలకు ఇస్తారని చెబుతున్నారు. కానీ ఆ సీటు తీసుకుని సజ్జల ఢిల్లీకి వెళ్లే అవకాశం లేదు. ఇప్పుడు సజ్జల సీఎం కంటే పవర్ ఫుల్ గా ఉన్నారు. కాబట్టి విజయసాయిరెడ్డికే సీటు ఖరారు చేస్తారని తెలుస్తోంది.
ఇక రెండు రాజ్యసభ స్థానాలు మాత్రం బీసీ, ఎస్సీ, మైనార్టీ కోటాలను చూసి ఇవ్వనున్నారు. వారు మాత్రమే సామాజిక సమీకరణాల కోటాలో చోటు దక్కించుకుంటారు. వారు ఎవరు అన్నదానిపై వైసీపీలో ఓ చర్చ వస్తోంది. గుంటూరు జిల్లా, నెల్లూరుకు చెందిన ఇద్దరు నేతల పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. అయితే రాజ్యసభ సీటు కోసం జగన్పై బయట నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంది. అందుకే సొంత నేతలకు కాస్త ఇబ్బందికర పరిస్థితేనని అంచనా వేస్తున్నారు.