ఇండియన్ వారెన్ బఫెట్‌గా పేరు పొందిన ప్రముఖ ఇన్వెస్టర్.. భారత బిలియనీర్లలో ఒకరైన రాకేష్ ఝున్ ఝున్ వాలా కన్నుమూశారు. ఆయన వయసు అరవై రెండేళ్లు మాత్రమే. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎలాంటి కంపెనీలు స్థాపించంకుండా కేవలం షేర్లు కొని అమ్మడం ద్వారా ప్రపంచ కుబేరుల జాబితాలో ఝున్ ఝున్ వాలా చేరారు. ఇటీవలే ఆకాశ ఎయిర్ అనే ఎయిర్ లైన్స్ కంపెనీని ప్రారంభించారు.
చదువుకుంటున్నప్పుడే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించిన ఆయన సీఏ పూర్తి చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అదే వ్యాపారంగా మార్చుకున్నారు. రూ.5 వేలతో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాు. ఇప్పుడు ఆయనసంపద విలువ సుమారు రూ.45 వేల కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా. టైటన్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, మెట్రో బ్రాండ్స్, కాన్కార్డ్ బయోటెక్ లాంటి ప్రైవేటు కంపెనీల్లో కూడా ఝున్‌ఝున్‌వాలాకు భారీగా వాటాలు ఉన్నాయి.
ఆయనపై వివాదాలూ ఉన్నాయి. ఆప్టెక్ కంపెనీకి చైర్మన్‌గా ఉన్న ఆయన ఆప్టెక్ లిమిటెడ్ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించిన కేసులో ఇదే ఏడాది జులైలో రాకేశ్, ఆయన భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా, మరో 8 మంది రూ.37 కోట్లకు పైగా చెల్లించారు. ఝున్‌ఝున్‌వాలా తన సంస్థ ‘రేర్ ఎంటర్ప్రైజెస్’ ద్వారా ట్రేడింగ్ చేస్తారు. ఆయన తన పేరు, తన భార్య రేఖ పేర్లలోని మొదటి రెండు అక్షరాలు కలిపి దానికి రేర్ అనే పేరు పెట్టారు. వారెన్ బఫెట్‌ను ప్రపంచంలో ఇప్పటివరకూ అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుడుగా భావిస్తారు. ఫోర్బ్స్ వివరాల ప్రకారం ప్రస్తుతం బఫెట్ మొత్తం సంపద విలువ 10,200 కోట్ల డాలర్లు.